June 7, 2013

దేశం ‘రుణ’వ్యూహం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన రైతు రుణాల మాఫీ పథకం గ్రామాల్లో ప్రభంజనం సృష్టిస్తుండటంతో ఆ పార్టీలో మళ్లీ అధికారంలోకి వస్తా మన్న ఆశలు చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వ స్తే రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తామని, వడ్డీ లేని రుణా లిస్తామంటూ చంద్రబాబు తన పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చిన ఫలితంగా, బ్యాంకులకు రుణాల రికవరీ పడ కేశాయి. దాదాపు 40 శాతం రికవరీ నిలిచిపోయిందని, రాజకీయ పార్టీల హామీవల్లే ఈవిధంగా జరుగుతోందని ఆంధ్రా బ్యాంక్‌ సీఎండీ ప్రభాకర్‌ ఇటీవల జరిగిన ఎస్‌ ఎల్‌బీసీ భేటీలో వెల్లడించిన విషయం తెలిసిందే. 32 లక్షలమంది రైతులు రుణాలు చెల్లించడం లేదంటే రైతా ంగంలో బాబు ఇచ్చిన హామీపు విశ్వసనీయత పెరుగు తున్నట్లేనని పార్టీ నేతలు భావిస్తున్నారు.

కాగా, తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరు గుతున్న పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమా వేశాల్లో నేతలు రైతు రుణాల మాఫీనే ప్రముఖంగా ప్రస్తా విస్తున్నారు. తాము ఈపాటికే గ్రామాల్లో రైతు రుణాల మాఫీ హామీని ప్రచారం చేస్తున్నామని, పాదయాత్రలో మీ రు హామీ ఇచ్చిన వెంటనే ఈ హామీని పల్లెలకు చేరవే స్తుండటంతో సానుకూల వాతావరణం కనిపిస్తోందని బా బు దృష్టికి తీసుకువెళుతున్నారు. తాము కూడా రుణాలు కట్టవద్దని, తమ పార్టీ అధికారంలోకి వస్తే మాఫీ చేస్తామని స్పష్టం చేస్తున్నామన్నారు. ఫలితంగా, టీడీపీ అధికారం లోకి వస్తే రుణాలు మాఫీ చేస్తుందన్న భావనతో రైతులు రు ణాలు కట్టడం లేదని వివరించారు. ఈ సంఖ్యను మరింత పెంచినట్టయితే ఫలితం ఉంటుందని సూచించారు. అయి తే, బ్యాంకర్ల నుంచి రైతులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని బాబు దృష్టికి తీసుకువెళ్లారు.

ఇప్పటికే దాదాపు 32 లక్షల మంది రైతులు పార్టీ హామీపై భరోసాతో రుణాలు చెల్లించడంలేదని, ఈ సంఖ్యను మరిం త పెంచేందుకు స్థానిక నాయకత్వాలకు ఏదైనా కార్యా చరణ ఇస్తే బాగుంటుందని ఓ నాయకుడు సూచించగా, చాలామంది నాయకులు దానిని సమర్థించారు. అంటే దీన్నిబట్టి 32 లక్షలమంది రైతులు పార్టీని విశ్వసిస్తు న్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని, ఆ రైతు కు టుంబాల్లో ఎంతమంది ఉంటే అంతమందినీ ఆకర్షించే బాధ్యత స్థానిక గ్రామ కమిటీలే తీసుకోవాలని, ఆమేరకు గ్రామాలవారీగా రైతు రుణమాఫీ చైతన్య సదస్సులు నిర్వ హించాలని సూచించగా, బాబు అందుకు సానుకూలంగా స్పందించారు. దానికి స్పందించిన చంద్రబాబునాయుడు మనం అధి కారంలోకి వస్తే కచ్చితంగా రైతు రుణమాఫీపైనే తొలి సం తకం చేస్తామన్న విషయాన్ని రైతులకు ఇంకా స్పష్టంగా చె ప్పాల్సిన అవసరం ఉంది.

ఆ బాధ్యత మీదే. మీరు పట్టణా లకు పరిమితం కావద్దు. గ్రామాలపై దృష్టి పెట్టండి. మన విధానాన్ని అందరికీ అర్ధమయ్యేలా చెప్పండి. అవసరమైతే దానిని కరపత్రాల రూపంలో ఇంటింటికీ వెళ్లి వివరిం చండి. స్థానికంగా ఎంతమంది రుణాలు కట్టడం లేదో వివరాలు సేకరించండి. దానిప్రకారం ముందుకు వెళ్ల వచ్చు. రైతు రుణాల మాఫీపై రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు స్థానిక నాయకులు కలసి ఒక ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్లండని ఆదేశించారు.