June 7, 2013

వైకాపా, తెరాసా కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీలు:చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలు నియోజకవర్గాల కార్యకర్తలతో హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని జిల్లాలకే పరిమితమైన పార్టీల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

తెరాస కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితమని, అది అన్ని జిల్లాల్లో ప్రభావం చూపలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమలో రెండున్నర జిల్లాలకే పరిమితమైందని, ఉత్తరాంధ్రలో ఉనికే లేదని, కోస్తాంధ్రలో ప్రభావం తగ్గిందని చెప్పారు. 294 జిల్లాల్లో టిడిపి ఉందని, కాబట్టి వచ్చే ఎన్నికలలో టిడిపియే గెలుస్తుందని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.