March 1, 2013

దేశమే గెలిచంది

ఎన్ని అవాంతరాలు సృష్టించినా తెలుగుదేశం పార్టీ డీసీసీబీ, డీసీఎంఎస్‌లను సునాయాసంగా గెలుచుకుంది. ఊహించని విధంగా ఆ పార్టీ అభ్యర్థులకు 75 నుంచి 80 చొప్పున ఓట్లు వచ్చా యి. కాంగ్రెస్ 52 సొసైటీలలో గెలుపొందినా డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఓట్లు వేయించుకోలేకపోయింది. మొదటి నుంచి టీడీపీ బలంగా ఉన్న సొసైటీలకు ఎన్నికలు జరగకుండా అధికార పార్టీ నే తలు అవాంతరాలు సృష్టించారు.

నూ తక్కి సొసైటీకి నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయ్యి అధ్యక్షుడిని ఎన్నుకోబోయే సమయంలో మంత్రి కాసు వెం కటకృష్ణారెడ్డి స్టేఇచ్చి నవ్వులపాలయ్యా రు. ఓటర్ల చేర్పుల సమయం నుంచి ఎన్నిక పూర్తి అయ్యే వరకు టీడీపీ నేత లు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపిీలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఐకమత్యంగా ముం దుకు కదిలారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లను సునాయాసంగా గెలుచుకున్నారు.

ఫలించిన ముమ్మనేని ప్రయోగం సహకార ఎన్నికలు ప్రకటించిన తరువాత కాంగ్రెస్ డీసీసీబీ, డీసీఎంఎస్‌లను నిలబెట్టుకుంటుందని భావించారు. టీడీపీకి 50 సొసైటీలు వచ్చే అవకాశం ఉందనుకున్నారు. ఈ దశ లో చైర్మన్ పదవి కోసం అంతగా ఆసక్తి చూపలేదు. ఒక దశలో పెదకూరపాడు బుజ్జి చైర్మన్ పదవిని ఆశించి పరసతాళ్లూరు సొసైటీలో అధ్యక్షుడుగా గెలుపొందటానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ దశలో ఊహించని విధంగా ముమ్మనేని వెంకట సుబ్బ య్య పేరు తెరపైకి వచ్చింది. జంపని షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌గా, ఆదర్శ రైతుగా, ఇంజనీరింగ్ విద్యా వేత్తగా ఆయనకు పేరుంది.

దీంతో పాటు రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1989-2004 మధ్య నాలుగుసార్లు రేపల్లెలో పోటీ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత కూచినపూడి రద్దయింది. దీంతో రేపల్లెను బీసీలకు కేటాయించాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా వెంకట సుబ్బయ్యకు పోటీ చేసే అవకాశం లేదు. వీటన్నింటిని పరిశీలించిన సీనియర్ నేత లు ఆర్థికంగా బలవంతుడైన వెంకట సుబ్బయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. వ్యవసాయంపై మక్కువతో ఆయన ఇప్పటికీ పెసర్లంకలోనే ఉంటున్నారు. వెంకటసుబ్బయ్య అభ్యర్థిత్వం ప్రకటించిన తరువాత పార్టీ నేతలంతా ఐకమత్యంగా పని చేశారు. ఎన్నికల ముందే కొన్ని సొసైటీలకు ఆర్థిక వనరులు సమకూర్చారు. మొత్తం మీద వెంకట సుబ్బ య్య ప్రయోగం ఫలించింది.

ఉపయోగపడిన చంద్రబాబు పాదయాత్ర

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు చం ద్రబాబు నాయుడు సహకార ఎన్నికల సమయంలోనే జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో పార్టీకి మంచి ఊపు వచ్చింది. సహకార ఎన్నికల్లో నేతలు ఐకమత్యంగా పని చేసే విధంగా చంద్రబాబు అప్రమత్తం చేశారు. 63 ఏళ్ల వయసులో చంద్రబాబు పాదయాత్ర చేస్తూ పార్టీని ఉత్సాహ పరుస్తున్నా నేతల్లో కదలిక లేదంటూ కార్యకర్తలు అప్రమత్తం అయ్యారు.

న్యాయ పోరాటానికి దిగిన దేశం

అధికార పార్టీ న్యాయ బద్ధంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌లను గెలవలేమని భావించింది. మంత్రి కాసు ద్వారా 13 సంఘాలకు స్టే ఇచ్చారు. దీనిని తెలుగుదేశం నేతలు న్యాయ బద్ధంగా ఎదుర్కొన్నారు. హైకోర్టులో ఫిర్యాదు చేసి డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల ఎన్నికల వాయి దా వేయించారు. దీంతో తెలుగుదేశంలో నైతిక బలం పెరిగింది. కాంగ్రెస్ నేతలు టీడీపీని ఎదుర్కోవటానికి అనేక ప్రయత్నాలు చేశారు. వాటన్నింటిని చాకచక్యంగా తిప్పి కొట్టారు. సొసైటీ అధ్యక్షులతో చంద్రబాబు నేరుగా చర్చించి డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలపై న్యాయ పో రాటానికి సిద్ధం చేశారు. ఈ దశలో అధికార పార్టీ ఎన్నికల తేదీని ప్రకటించింది.

క్యాంప్‌ల నిర్వహణతో లబ్ధి టిడిపి క్యాంప్‌లు ఏర్పాటు చేసి లబ్ధి పొందింది. కాంగ్రెస్ కర్నూలులో క్యాంప్ ఏర్పాటు చేస్తే టిడిపి విజయవాడలోని భవానీ ద్వీపంలో విడది చేసింది. ఒక దశలో ఎన్నికలు వాయిదా పడటం తో క్యాంపును క్లోజ్ చేశారు.

వెంటనే ఎ న్నికల తేదీ ఖరారు కావడంతో మరలా క్యాంప్ ఏర్పాటు చేశారు. విజయవాడలోని ముమ్మనేని వెంకట సుబ్బయ్య వియ్యంకుని హోటల్‌లో క్యాంప్ కొనసాగించారు. క్యాంప్‌లో ఎంత మంది ఉన్నా రు, బయట ఉన్న వారిలో పార్టీ సొసైటీ అధ్యక్షులు ఎంత మంది, మాజిక్ ఫిగర్ ఎంత, శత్రు శిబిరం నుంచి ఎన్ని ఓట్లు కొ నుగోలు చేయాలి అనే అంశంపై సుదీర్ఘం గా కసరత్తు చేశారు. జిల్లా అధ్యక్షుడు పు ల్లారావు, మాజీ మంత్రి ఆలపాటి, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి, ధూళిపాళ్ల, శివ శక్తి ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, యరపతినేనిలు ఎప్పటికప్పుడు క్యాంప్ కు వెళ్ళి అధ్యక్షులకు అండగా ఉన్నారు. మరో వైపు ఎమ్మెల్సీ రాజకుమారి కూడా క్యాంప్‌ను పరిశీలిస్తూ కాం గ్రెస్ కుయుక్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కాంగ్రెస్ క్యాంప్‌లో ఉన్న కొంత మంది సొసైటీ అధ్యక్షులకు ఆర్థిక వనరులు సమకూర్చారు. ఛైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే గుదిబండి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని పసికట్టా రు. వాటికి విరుగుడుగా మాజీ మంత్రి ఆలపాటి తన శిష్య గణం ద్వారా వైఎస్ ఆర్ సిపిలో ఒక వర్గంతో మంతనాలు జరిపారు. ఓట్లు చేర్పుల సమయంలో అధికారులు, కార్యదర్శులు పెట్టిన ఇబ్బందులను అధిగమించారు. ఇక్కు ర్రు, నందిరాజుపాలెం సొసైటీ అధ్యక్షులపై పోలీసులు కేసు నమోదు చేసినా తెలుగుదేశం నేతలు జంకలేదు. రెండు నెలల పాటు చేసిన సుధీర్ఘ పోరాటంతో రెండు జిల్లా స్థాయి ఛైర్మన్ పదవులను కైవసం చేసుకున్నారు.