February 11, 2013

కదిరికి నేడు నారా లోకేష్ రాక


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ సోమవారం కదిరికి వస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో లోకేష్ కదిరి పర్యటన వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాదు నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.30 గంటలకు కుటాగుళ్ళ వద్దకు చేరుకుంటారన్నా రు.

స్వాగతం పలికి అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా పట్టణంలోకి వస్తారన్నారు. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారన్నారు. ఎక్బాల్‌రోడ్డు, జీవిమాను సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్‌కు ర్యాలీగా చేరుకుంటారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తార్‌చాంద్‌బాషా నూతనంగా నిర్మించిన అత్తార్ రెసిడెన్సీ భవనంలో జరిగే ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని అ త్తార్ రెసిడెన్సీని ప్రారంభిస్తారన్నారు.

అనంతరం అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఏర్పాటు చేసిన మేలుకొలుపు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. చాంద్‌బాషా మాట్లాడుతూ తాము అంబేద్కర్ సర్కిల్‌లో నిర్మించిన అ త్తార్ రెసిడెన్సీ, ఏసీ బెన్‌క్విట్ హాల్ భ వనం ప్రారంభోత్సవానికి నారా లో కేష్ వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నియోజక వర్గంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

సమయాభావం వల్ల అం దర్నీ కలవలేక పోయానని , ఇదే మా ఆహ్వానంగా భావించి కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో టీడీపీ మహిళా నాయకురాలు ఎన్. పర్వీన్ భానూ, జిల్లా ఉపాధ్యక్షుడు టి. అరవిందబాబు, జి. దేవానంద్ పాల్గొన్నారు.

నేడు ఎంపీ, ఎమ్మెల్యేల రాక

సోమవారం కదిరికి నారా లోకేష్ కదిరికి వస్తున్న సందర్భంగా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు లాల్‌జాన్‌బాషా, ఎమ్మెల్యేలు పరిటా ల సునీత , పయ్యావుల కేశవ్, బి.కె.పార్థసారథి, అబ్ధుల్‌ఘనీ, పల్లెరఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు హనుమంతరాయ చౌదరి, మహాలక్ష్మీ శ్రీనివాస్, శమంతకమణి, హాజరు కానున్నట్లు మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తార్‌చాంద్‌బాషా వివరించారు.