January 9, 2013

ఓరగల్లును హోరెత్తించింది

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చివ రి రోజు పాదయాత్ర బిజీబిజీగా సాగింది. ప్రజలతో మమేకం అవుతూనే పార్టీ నాయకులు, కార్యకర్తలకు కర్తవ్యబోధ చేసారు. అన్నార్తులకు నేనున్నాని భరోసా ఇస్తూనే...పార్టీ కోసం సరిగా పని చేయని నేతలకు అంక్షింతలు వేసారు. ఏక కాలంలో అన్ని పనులను చక్కబెడుతూ పాదయాత్రలో చకచకా ముందుకు నడిచారు. చివరి రోజు పాదయాత్రలో భాగంగా చంద్రబాబు మంగళవారం 15 కిమీ నడిచారు. వస్రంతండా నుంచి మొదలైన పాదయాత్ర నాగారం, గోపితండా, నీలకుర్తి క్రాస్, ఎల్లంపేట, కుడియాతం డా, ఆనెపురం, సోప్లాతండా, దుబ్బతండా, మరిపెడ బంగ్లా వరకు సాగింది. ఇక్కడ బహిరంగ సభోలో బాబు ప్రసంగించారు.

మంగళవారం జిల్లాలో పాదయాత్ర చివరి రోజు కావడంతో నేతలు, కార్యకర్తల తాకిడి పెరిగింది. వివిధ వర్గాలు, సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా కలిసారు. నల్గొండ, గుంటూరు జిల్లాలో బాబు పాదయాత్ర రద్దయినట్టు తెలుసుకొని ఈ రెండు జిల్లాలకు చెందిన నాయకు లూ వచ్చారు. నల్గొండ నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. మార్గ మధ్యలో బాబును కలుసుకొని అభినందనలు తెలిపారు. బాబునుకు తమ మనసులోని మాటను చెప్పుకునేందుకు స్థానిక నాయకులు తహతహలాడడం కనిపించింది. వారి నుంచి వినతులను స్వీకరించారు. అభ్యర్ధనలను ఆలకించారు. ఉదయం 12 గంటలకు చంద్రబాబు బస చేసిన బస్సు నుంచి బయటకు వచ్చారు. అప్పటికే వేచి ఉన్న ప్రజల ను, ప్రజా సంఘాల నాయకులను కలుసుకున్నారు. నాదెండ్ల గంగాధర్ నేతృత్వంలో ఆమెరి కా నుంచి వచ్చిన తానా ప్రతినిధుల బృందం, గంగు ఉపేంద్రశర్మ నాయకత్వంలో తెలంగాణ అర్చక సమాఖ్య ప్రతినిధులు బాబును కలిసిన వారిలో ఉన్నారు.

పాలకుర్తినేతలతో భేటి

అనంతరం పాలకుర్తి నియోజకవర్గ సమన్వ య కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగించారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదు, వాటి కం ప్యూటీకరణ గురించి అడిగారు. నియోజకవర్గం లో కమిటీల ఏర్పాటును కూడా చంద్రబాబు సమీక్షించారు. కమిటీలను పూర్తి స్థాయిలో వే యనందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ లే వేయలేనివారు భవిష్యత్తులో వచ్చే ఎన్నికల ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించారు. నియోజకవర్గంపై గతంలో లాగానే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవలసిందిగా టీడీపీ తెలంగాణఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆదేశించారు.

అందరితో మమేకం

పాదయాత్రలో దారిపొడవునా అనేక మంది ని కలిసారు. రైతులు, వ్యవసాయ కూలీలు, వివి ధ వృత్తులవారు, కులసంఘాల వారు బాబును కలిసి సమస్యలను చెప్పుకున్నవారిలో ఉన్నారు. పెదనాగారం శివారులోని అమిరియా తండా వద్ద పల్లి చేనును సందర్శించారు. పంట పరిస్థితిపై ఆరా తీసారు. నాసిరకం విత్తనాల వల్ల ఈ సారి పంట దిగుబడి తగ్గిపోయిందని రైతు వా పోయాడు.గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు.

రొట్టెతిన్న బాబు

నీలకుర్తి స్టేజ్ వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న ఒక లంబాడా గిరిజనుని ఇంట్లో చంద్రబాబు జొన్నరొట్టె ఆరగించారు. శంకర్ నాయక్ అనే ఈ గిరిజనుడు బాబు కోసం అప్పటికప్పుడు రొట్టెను తయారు చేసి వేడి వేడిగా అందించారు. కారం అద్దుకొని తిన్న బాబు రొట్టె రుచిగా ఉందని మెచ్చుకున్నారు. తనకు ఆతిధ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ వివరాలు అడి గి తెలుసుకున్నారు. మీరు ఎప్పటికీ గుర్తుంటారంటూ సెలవు తీసుకున్నారు. మార్గమధ్యలో ఒక టీకొట్టు దగ్గర ఆగారు. టీ కొట్టు యజమానితో మాట్లాడారు. రోజుకు ఎంత సంపాదిస్తున్నావని అడిగారు. జీవనం గడుస్తుందా అని ప్రశ్నించారు.

ఐకేపీ ఉద్యోగులకు అభయ హస్తం

నీలుకుర్తి క్రాస్‌రోడ్ వద్ద రోడ్డు ప్రక్క టెంట్ వేసుకొని తన కోసం ఎదురు చూస్తున్న ఐకేపీ యానిమేటర్లను చంద్రబాబు కలుసుకున్నారు. ప్రభుత్వం తమచేత వెట్టి చాకిరి చేయించుకుంటోందని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, పై గా కుంటిసాకులు చూపుతూ ఉద్యోగాల నుంచి అక్రమంగా తొలగిస్తున్నారని డ్వాక్రా సంఘాల నాయకురాలు మాధవి టీడీపీ అధినేతకు వివరించింది.

టీడీపీ హయాంలో ఒక వెలువు వెలిగిన వెలుగు ప్రాజక్టుపై ప్రస్తుతం చీకట్టు ముసురుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు స్పందిస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐకేపీ సిబ్బందిని పూర్తిస్థాయి శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తుందని, మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ఆర్ధిక ప్రయోజనాలను కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

జడకొప్పు కోలాటం

ఎల్లంపేట వద్ద జడకోప్పు ఆటలో కొద్ది సేపు పాల్గొన్నారు. ఆటను చూసి ఆనందించారు. ఒక పొడవాటి స్తంబానికి చుట్టూ రిబ్బన్లు కట్టి వాటి తిరుగుతూ కోలాటం ఆడే ఈ ఆట శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకల్లో ఎక్కువగా ఆడుతారు.

జిల్లా నేతలతో...

ఎల్లంపేట వద్ద మధ్యాహ్నం రోడ్డు ప్రక్కనే బస్సులోనే బాబు భోజనం చేశారు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. జిల్లాలో పాదయాత్ర ముగుస్తున్న సందర్భంగా చివరి సారిగా జరిగిన ఈ భేటిలో బాబు నేతల కు కొన్ని ముఖ్యమైన సూచనలు, సలహాలు ఇచ్చినట్టు సమాచారం. భవిష్యత్తులో పార్టీ చేపట్టయో కార్యక్రమాలపై స్థూలంగా మాట్లాడిన ట్టు తెలిసింది.

వీడ్కోలు

మరిపెడ బంగ్లా వద్ద జరిగిన బహిరంగ సభలో బాబు పాల్గొన్నారు. అనంతరం జిల్లా నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది ప్రజల నుంచి వీడ్కోలు తీసుకుంటూ ఖమ్మం జిల్లా సరిహద్దులోకి అడుగుపెట్టారు. ఇంతటితో చంద్రబాబు 11 రోజుల పాదయాత్ర ముగిసింది. పాదయాత్రను విజయవంతం చేసినందుకు జిలా నేతలను అభినందించారు.