January 9, 2013

వస్తున్నా .. మీకోసం





తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టి 100 రో జులు పూర్తయిన సందర్భంగా తెలుగుయువత రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో పూల తీవాచీలు పరిచారు. వందో రోజు యాత్ర ప్రారంభించేందుకు బాబు వస్తున్న దారి పొడవునా పసుపు బంతిపూలు పరి చి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకోసం ఖమ్మం విజయవాడ నుంచి మూ డు క్వింటాళ్ల బంతిపూలు తెప్పించారు. చంద్రబాబు బస చేసిన గుడారం నుంచి రాష్ట్ర కమిటీ సమావేశం వేదిక వరకు బ ంతిపూలను నేలపై పరిచారు.

ముగ్గులేసిన మహిళలు

చంద్రబాబు పాదయాత్ర చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా తెలు గు మహిళ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ రంగవల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాదయాత్ర ని మిత్తం జిల్లాలో అడుగిడిన చంద్రబాబునాయుడుకు తెలుగు మహిళలు శు భాకాంక్షలు తెలిపారు. అందమైన ము గ్గులను వేశారు. బంతిపూలతో ఆలంకరించారు. రాత్రి 8గంటలకు ముగ్గును ప్రా రంభించి తెల్లవారు జా మున పూర్తి చే శారు. కార్యక్రమంలో తెలుగు మహి ళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి, కార్యదర్శి సుప్రియ, నాయకురాళ్లు సత్యవాణి, ప ద్మ జా, సేకిలారెడ్డి, పాల్గొన్నారు.

వంద కిలోల భారీ కేక్‌ల కటింగ్

చంద్రబాబునాయుడు పాదయాత్ర చేప ట్టి వందరోజులు పూర్తయిన సందర్భం గా మాదిరిపురంలో రెండు వంద కిలో ల భారీ కేక్‌లను కట్ చేశారు. చంద్రబాబు బస చేసి న గుడారం వద్ద నారా లోకేష్ యువసేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వంద కిలోల కేక్‌ను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కట్‌చేశారు. తరువాత పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం వద్ద జిల్లా తెలుగు యువత అ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరో కేక్‌ను చంద్రబాబు కట్ చేశారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన నాయకులు కా ర్యకర్తలకు కేక్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా నాయకులు కేతినేని హరీష్, చింతని ప్పు కృష్ణచైతన్య, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి తోటకూర రవిశంకర్ లోకేష్ యువసేన రాష్ట్ర నాయకులు గు ర్రం రామకృష్ణ, భానుచందర్, రా మా రాజు, అ శోక్ తదితరులు పాల్గొన్నా రు.

సావనీర్ ఆవిష్కరణ

వంద రోజుల పాదయాత్ర విశేషాలను వివరిస్తూ కార్యక్రమ సమన్వయకర్తలు దీపక్‌రెడ్డి, గరికపాటి రాంమోహన్‌రావు తదితరులు రూపొందించిన సావనీర్‌ను చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. వారిని అభినందించారు.

అధినేత కోసం విచిత్రవేషం

చీరాలకు చెందిన అభిమాని మనోహర్ హరిదాసు వేషం వేశారు. అందర్నీ అలరించారు.

తల కెక్కిన అభిమానం

చంద్రబాబునాయుడిపై అభిమానాన్ని చాటుకుంటూ నగరంలోని ప్రకాశ్‌నగర్ కు చెందిన అప్జల్ అనే కారు డ్రైవర్ తన తలపై చంద్రబాబు అనే అక్షరాన్ని కనిపి ంచేలా జుత్తును కత్తిరించుకున్నారు.

బాబుకు కుల సంఘాల స్వాగతం

జిల్లాలో పాదయాత్ర చేపట్టిన చంద్రబాబునాయుడుకు వివిధ వృత్తి సంఘాలు ఘనస్వాగతం పలికాయి. వృత్తి విశేషాలను చంద్రబాబు యాత్ర మార్గంలో దారి పొడవునా ప్రదర్శించారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని వివిధ కుల సంఘాల నాయకులు చం ద్రబాబుకు వినతిపత్రాలను సమర్పించారు.


సంక్రాంతి అరిశెల రుచి

తెలుగు మహిళా కమిటీ అధ్వర్యంలో సంక్రాంతి అరిశెలను తయారు చేశారు. బాబుకు రుచి చూపించారు. నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసిన అరిశెలను రాష్ట్ర కమిటీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు పంచారు.


చంద్రన్న కోసం

చంద్రబాబునాయుడుపై అభిమానంతో వికలాంగులు పాదయాత్ర కార్యక్రమ ం లో పాల్గొన్నారు. నరసరావుపేటకు చెం దిన పీ.సునీల్‌కుమార్ అనే వికలాంగుడు కాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోని యాత్రలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబునాయుడు నిర్వహించిన వివిధ నిరసన కార్యక్రమాల్లో కూ డా సునీల్‌కుమార్ పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆం ధ్రజ్యోతి ఆయన్ను పలకరించగా ' క ష్టాల కడలి లో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డున పడేసేందుకు ఆయన చేస్తున్న యాత్ర ముందు నేను చేస్తున్నదెంత'' అని పే ర్కొనడం గమనార్హం.

బసవన్నల నృత్యం

చంద్రబాబు వందో రోజు పాదయాత్రను పురష్కరించుకుని డోలు వాయిద్యాల కనుగుణంగా బసవన్నలతో నృత్యం చేయించారు.