January 9, 2013

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు


బుధవారం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత స మావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు ప్ర భుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కేంద్రం వత్తిడితో విద్యుత్ బిల్లులను దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 70శాతం పెం చారన్నారు. టెలిస్కోపిక్ విధానాన్ని ఎ త్తివేయడం వల్ల ప్రజలపై రెట్టిం పు భా రం పడుతోందన్నారు. 2009 ఎన్నికల ముం దు అప్పటి సీఎం వైఎస్ అధి క ధరలకు విద్యుత్ కొని డిస్కంలకు రూ. 6వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టడంతో భారం ప్రజలపై పడిందన్నా రు. వ్యవసాయ సంక్షోభం అనే అం శం పై మాజీమంత్రి కోడెల శివప్రసాదరావు మాట్లాడుతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు బడ్జెట్‌ను మాయాజాలంగామార్చి వ్యవసాయ రంగానికి నిధులు కేటాయిస్తున్నట్టు కేవలం లెక్కలే చూపారన్నారు. డీఏపీ «ధరను రూ.480 నుంచి 1266కు, కాంప్లెక్స్ ఎరువులు రూ. 1200 పెంచారన్నారు. కేవలం మూడేళ్ల లో 12సార్లు ధరలు పెంచి రైతన్నల నడ్డివిరిచారన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలు శో భా హైమావతి మా ట్లాడుతూ ఢిల్లీ లో వైద్య విద్యార్ధినిపై అతికిరాతకంగా అ త్యాచారంచేస్తే బొ త్స, షిండే , షీలాదీక్షిత్,అభిజిత్ ముఖర్జి తదితర నేతలు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయ డ ం సిగ్గుచేటన్నారు. ములుగు ఎమ్మెల్యే సీ తక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం దీపం ప«థకాన్ని కొండెక్కించిందనివిమర్శించారు. ఏడాదికి 10 లక్షల చొ ప్పున మూడేళ్లలో 30లక్షల కనెక్షన్లుఇస్తామని వైఎస్ఆర్ హామీ ఇచ్చినా 8 ఏళ్లలో కేవలం పదిలక్షల కనెక్షన్లు కూడా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేశారని విమర్శి ంచారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశ వ్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు తె లు సుకునేందుకే చంద్రబాబు 63ఏళ్ల వ యస్సులో కూడా వస్తున్నా మీకోసం పేరి ట పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపా రు. ఆరోగ్యం సహకరించ కపోయినా 15 81 కి.మీ. పాదయాత్ర పూర్తిచేశారని తెలిపా రు. 630 మందికి రూ. 15.87లక్ష లు ఆ ర్థికసహాయం చేశారన్నారు.

టీడీపీ హా మీలపై మాట్లడుతూ రైతులకు రుణమా ఫీ, బీసీలకు వంద అ సెంబ్లీ స్థా నా లు, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేష న్లు, ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యా యం, జిల్లా యూనిట్‌గా గిరినులకు రి జర్వేషన్లు, వికలంగులకు నెలకు రూ.1 500, వృద్ధాప్య, వితంతువులకు రూ. 600 ఇస్తామని తెలిపారు. పొలిట్‌బ్యూరో స భ్యుడు కేఈ కృష్ణమూర్తి మాట్లాడు తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి స భ్యత్వ నమోదు ఎంతో కీలకమన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇన్‌చార్జిలను ని యమించి సభ్యత్వ నమోదు చురుగ్గాసాగేటట్టు చూ డాలని సూచించారు.