January 9, 2013

కాంగ్రెస్ వల్ల బీసీలకు నష్టమే



 
వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్ గెలిస్తే బీసీలకు మిగిలేది మట్టేనని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సు బ్రమణ్యం విమర్శించారు. మంగళవారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రె డ్డి హయాంలో 93 బీసీ కులాలను 145కు పెంచారని, రిజర్వేషన్లు మాత్రం పెంచలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మహిళా బీ సీలకు అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీల సం క్షేమానికి పాటుపడే వ్యక్తని కొనియాడారు. బీసీల డిక్లరేషన్‌ను ప్రకటించిన చంద్రబాబుకే బీసీల మద్దతు ఉంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతారన్నారు. చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించి వంద రోజులైన సందర్భంగా జి ల్లాలో చంద్రబాబుకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం చెబుతామన్నారు. బీసీల్లోని అన్ని కులాల వారు ఈ స్వాగత కా ర్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహగౌడ్, కార్యదర్శి రాము, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామారావు, శ్రీరాములు, కందగట్ల రాజేందర్, నాయకులు నాగేశ్వరరావు, నర్రా ఎల్లయ్య, కాపర్తి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.