January 4, 2013

కాంగ్రెస్ పార్టీది హత్యాసంస్కృతి



130 సంవత్సరాల చరి త్ర ఉందని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ హత్యలు చేయడాన్ని తమ సంస్కృతిగా పెట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పాదయాత్రలో భాగంగా గీసుగొండ మండలం కొమ్మాల స్టేజీ వద్ద ఆయన టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడు తూ కాంగ్రెస్ కరడుగట్టిన ఫ్యాక్షన్ సంస్కృతి వల్ల గీసుగొండ మండలాని కి చెందిన ముఖ్య నేతలు కొల్లి ప్రతాప్‌రెడ్డి , గోపగాని ప్రతాప్, కొమ్ము కొమురయ్య, దాడి వెంకటయ్య, సుధాకర్‌లు బలి అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.

పిల్లల ప్రశ్నలకు బాబు జవాబు..: కొమ్మాల సమీపంలోని వికాస్ హై స్కూల్‌కు చెందిన విద్యార్థులతో బాబు భుటీ అయ్యారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్, వ్య వసాయ రంగం, ఐటీ, మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలపై చిన్నారులు చంద్ర బాబును పలు ప్రశ్నలు అడిగారు. త మ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిం గ వివక్ష లేదని ఆడపిల్లల పట్ల ప్రత్యేకమైన శ్రద్దతో పలు పథకాలను ప్రవేశపెట్టామని వారికి బాలిక సంరక్షణ పథ కం కింద రూ.5 వేలు ఇచ్చామని, స్కూ ల్‌కు వెళ్ళే బాలికలకు సైకిళ్లు ఇచ్చామని తెలిపారు. విద్యా, ఉద్యోగం, వ్యవసా యం పై తాను సీఎంగా ఉన్నప్పుడు అనేక సదుపాయలను కల్పించిన ఘన త తమకే చెందుతుందని చిన్నారులకు తెలిపారు. విద్యార్థులైన మీరు గాంధీ, అంబేద్కర్, ఎన్‌టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని చదువుకోవాలన్నారు.

బాలుడికి పేరు పెట్టి న బాబు..: కొమ్మాలకు చెందిన స్థానిక టీడీపీ నాయకుడు సుధాకర్ నాయక్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెద్ద కుమారుడు పేరు లోకేష్ కావడంతో తన రెండో కుమారుడికి పే రును పెట్టాల్సిందిగా అతడు బాబును కోరాడు. దీంతో అతడి పేరు అఖిలేష్ గా ఆయన నామకరణం చేశాడు.

6 కిలో మీటర్లు...: మండలంలో చంద్రబాబు పాదయాత్ర ఆరో రోజు ఉత్సాహంగా కొనసాగింది. గురువారం ఉదయం 11.15 గంటలకు గీసుగొండ మండలంలోకి ప్రవేశించారు. నెమ్మదిగా సాగుతూ మధ్యమధ్యలో రైతులను చిన్నారులను, ఇంజనీరింగ్ విద్యార్థుల ను, మహిళలను పలుకరిస్తూ ముందు కు సాగారు, గిర్నిబావి సమీపంలోని కుడా సూచిక బోర్డు నుంచి మండలంలోకి ప్రవేశించి దుడ్ల తండా, కొమ్మాల, దస్రూ నాయక్ తండా, మంగల్ తండా మీదుగా సంగెం మండలంలోకి ప్రవేశించారు. బాబు ఉదయం 11.15 గంటలకు గీసుగొండ మండలంలోకి ప్రవేశించగా సాయంత్రం 4.30 గంటలకు సంగెం మండలంలోకి వెళ్లారు.

కాగా, మండలంలో బాబుపాదయాత్రను అడ్డుకునేందుకు వచ్చిన వి ద్యార్థులైన నమిండ్ల ప్రమోద్,కొడారి న రేష్,రంగరాజుల రవికాంత్,నమిండ్ల శ్రీనివాస్‌లపై గీసుగొండ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.