January 4, 2013

నాగలి పట్టారు... జామ పండ్లు కొన్నారు



మండలంలోని గిర్నిబావిలో బుధవారం రాత్రి బస చేసిన టీడీపీ నేత చంద్రబాబు నాయుడు గురువా రం మండల పరిధిలో కిలో మీటర్ వరకు పాదయాత్ర చేశా రు. గిర్నిబావి సమీపంలోని చాపలబండకు చెందిన రైతు కా సం చిన్న ఐలయ్య పంటభూమిలో దుక్కి దున్నుతుండగా బాబు నాగలి పట్టి కొద్ది దూరం దున్నిన తర్వాత రైతు ఐలయ్యతో ముచ్చటించారు. గతంలో భూమిలో పంట వేశావా అని, దిగుబడి ఎంత వచ్చింది, ఎందుకు దున్నుతున్నావని రైతును బాబు అడగగా రైతు మాట్లాడుతూ పత్తి పంట వే యగా నీలం తుఫాన్ ప్రభావంతో దెబ్బతిందని పెట్టిన పెట్టుబడి కూడా రాలేదని, మళ్లీ మొక్కజొన్న వేయడానికి దుక్కి దున్నుతున్నట్లు రైతు తెలిపాడు. బాబు రైతుతో మాట్లాడు తూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడంలేదని, మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు అండగా ఉండి ఆదుకుంటానన్నారు.

తర్వాత చాపలబండకు చెందిన మహిళ రైతు మేర్గు సమ్మక్కతో ముచ్చటించారు.పంటల సాగు ద్వారా కుటుంబ పోష ణ ఎట్లా ఉందని సమ్మక్కను అడిగారు. సమ్మక్క మాట్లాడు తూ వర్షాలు కురవడం వల్ల పంటలు దెబ్బతిన్నాయని, పెట్టుబడులు రాక అప్పుల్లో ఉన్నామని, పంట నష్టపరిహారం రా వడంలేదని తెలిపింది. బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను ఆదుకోవడం లేదని, రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. అదే రహదారిపై సైకిల్‌పై జామపండ్లు అమ్ముతున్న మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన రాసమల్ల ఉప్పలయ్య దగ్గరకు బాబు వెళ్లి పండ్ల వ్యాపారం ఎలా ఉందని, రోజుకు ఎంత గిట్టుబాటవుతున్నదని ప్రశ్నించారు. ఉప్పలయ్య మాట్లాడుతూ రోజుకు రూ. 80 నుంచి రూ.120 వరకు గిట్టుబాటు అవుతోందని తెలిపాడు. వ్యా పారి మాటలతో బాబు జామపండ్లు తీసుకుని రూ.2 వేల నగదును అతడికి అందించారు.

తర్వాత గీసుకొండ మండలం కొమ్మాల పరిధిలోకి పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్రలో నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, నాయకులు ఆరె సుదర్శన్‌రెడ్డి, బి.రవీందర్, రాజేశ్వర్‌రావు, రజినికర్‌రెడ్డి, కొలగాని రవి తదితరులు పాల్గొన్నారు.