January 4, 2013

బడుగుల వేదన వింటూ..



టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం తన ఆరవ రోజు పాదయాత్రను ఉత్సాహంగా పూర్తి చేశారు. ప్రజల నుంచి.. ఆవే సమస్యలు. అవే వినతులు. తమను ఆదుకోవాలన్న అభ్యర్ధన లు. ఆపన్న హస్తం కోసం ఆర్తిగా ఎదురుచూపులు. దారి పొడవునా బారులు తీరిన గ్రామీణులు. మంగళహారతులతో మహిళలు. వినతి పత్రాలతో మరికొందరు. సహాయం కోసం ఇంకొందరు. గురువారం గిర్నిబావి నుంచి చంద్రబాబు పాదయాత్ర మొదలైంది. గీసుగొండ మండలం కొమ్మాల, సంగెం మండలం దస్రూనాయక్ తండా, మహరాజాతండా, పల్లార్‌గూడ, చింతపల్లి, సంగెం, తిమ్మాపూర్ గ్రామాల మీదుగా 15.8 కిమీ సాగింది. తిమ్మాపూర్‌కు కొద్ది దూరంలో రాత్రి బస చేసారు.

అందరిని పలుకరిస్తూ..: గిర్నిబావిలో ఉదయం సరిగా 11.13 గంటలకు బాబు బస్సు నుంచి బయటకు వచ్చారు. తనకోసం వేచి ఉన్న నా యకులు, కార్యర్తలను పలకరించారు. అనంతరం ముందుకు సాగారు. కొమ్మాలలో ఒక రైస్‌మిల్లును సందర్శించారు. అందులో పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడారు. వారి కి ఏ మేరకు కూలి గిట్టుబాటు అవుతున్నది అడిగి తెలుసుకున్నారు. పని రోజు దొరుకుతన్నదీ లేనిది వాకబు చేశారు. సీజన్‌లో మాత్రమే పని దొరుకుతుందని, మిగతా కాలంలో ఇత ర ప్రాంతాలకు కూలీకి వెళతామని సాంబలక్ష్మి, రాదమ్మ అనే మహిళలు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద కూలి పను లు దొరకడం లేదన్నారు. మిల్లు యజమాని శంకర్‌తోనూ చంద్రబాబు మాట్లాడారు. కరెంట్ కొరత వల్ల మిల్లులు సరి గా నడవడం లేదన్నారు. ఉత్పత్తి పడి పోయి కూలీలకు పనిలేకుండా పోతోందన్నారు.

సంఘీభావం: మార్గం మధ్యలో ఎంఆర్‌పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు మందకుమార్, జిల్లా అధ్యక్షుడు బుర్ర మహేందర్ చంద్రబాబును కలిసారు. పాదయాత్రకు సంఘీభావాన్ని ప్రకటించా రు. దూద్యతండా వద్ద చంద్రబాబు వికలాంగుడిని కలుసుకున్నారు. అతడి జీవన స్థితిగతులను విచారించారు. ఫించన్ వస్తున్నది లేనిదీ ఆరా తీసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగులకు నెలకు రూ.1500 వరకు పించన్ ఇస్తామని వాగ్దానం చేశారు. కొంత మంది మహిళా కూలీల తో కూడా బాబు మాట్లాడారు. మార్గంమధ్యలో టీడీపీ అర్బ న్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి నాయకత్వంలో జిల్లా వడ్డెర సంఘం నాయకులు చంద్రబాబును కలిసి పాదయాత్రకు మద్దతు పలికారు. వడ్డెరలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాన్ని అందచేశారు. వడ్డెరలను ఎస్సీ కేటగిరిలో చేర్చాలని అందులో కోరారు. బాబు పలు చోట్ల పార్టీ పతాకాలను ఆవిష్కరించారు.

ఆ మూడు పార్టీలపై నిప్పులు: కొమ్మాలలో బహిరంగ సభలో చద్రరబాబు మాట్లాడు తూ కాంగ్రెస్,టీఆర్ఎస్, వైసీపీలను తూర్పారబట్టారు. కాం గ్రెస్ అసమర్ధ పరిపాలన వల్ల అన్ని రంగాలు భ్రష్టుపట్టాయన్నారు. పేదవాడు బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. కాంగ్రెస్‌వారిని తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభివృద్ధి నై అం టే... వై ఎస్ ఆర్‌సీపీ అవినీతికి సై అంటోందని చమత్కరించారు. ముఖ్యమంత్రిపై కూడా నిప్పులు కురిపించారు. ఆయ న అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. దొంగలకు కొమ్ముకాస్తున్నా రు. టీడీపీని దెబ్బతీసేందుకు కుటిల యత్నాలకు పాల్పడుతున్నారు అని ధ్వజమెత్తారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హ యాంలో అభివృద్ధిపై కంటే నేరస్తులను తయారు చేయడంపైనే ఎక్కువ దృష్టి సారించారు అన్నారు. వైఎస్ పాలనలోనే గీసుగొండలో టీడీపీ కార్యకర్తలు ప్రతాప్‌రెడ్డి, దాడి వెంకటయ్యతో పాటు మరికొందరు హత్యలకు గురయ్యారని తెలిపా రు. వైఎస్ జగన్ లక్షల కోట్ల రూపాయలను అడ్డంగా, అక్రమంగా ఆర్జించాడనీ, ఇప్పుడు చేసిన తప్పుల నుంచి బయట పడడానికి కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టడాని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్‌ని కూడా విడవలేదు. ఆ పార్టీపై కూడా విమర్శ లు కురిపించారు. ఆఖిల పక్ష సమావేశం తర్వాత ఆ పార్టీ నాయకుల గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయనీ, ఏటూతోచక టీడీపీపై అనవసరంగా విరుచుకుపడుతున్నారన్నారు. మీ పెద్ద కొడుకుగా, మీ ఇంటి పెద్దన్నగా అందరికి అండగా, అందుబాటులో ఉంటాను. మీ మనసులో నాకింత చోటివ్వండని బాబు అభ్యర్ధించారు. మీ సేవకుడిగా పని చేస్తానని అన్నారు.

బాబు వరాలు: పాదయాత్రలో బంజార సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందచేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడుతూ తండాను గ్రామ పంచాయతీలుగా చేస్తానన్నారు. ప్రతీపేదవాడికి 2 ఎకరాల భూమిని, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందచేస్తానని, లంబాడాలకు ఐటీడీఏ లాగా ప్రత్యేక ఏజెన్సీనీ ఏర్పాటు చేస్తానని వరాలు ప్రసాదించారు.