January 3, 2013

కేసీఆర్‌తో ఒరిగేది శూన్యం

కేసీఆర్ పచ్చకామెర్ల రోగి. ఆయనకు లోకమంతా పచ్చగానే కనిపిస్తోంది. వాస్తవా న్ని గ్రహించలేక పోతున్నాడు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం అఖిల పక్ష సమావేశంలో స్పష్టం గా చెప్పినా వినడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గురువారం సంగెం మండల కేంద్రానికి చేరుకున్నారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పార్టీ 12 ఏళ్ళవుతోంది. ఇప్పటి వరకు క్యాడర్‌నే పెంచుకోలేనివాడు రేపు ప్రజలకేం సేవచేస్తాడని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రజలను ఎమి ఉద్దరించింది? దే ని మీద పోరాడింది? అని నిలదీసారు. కేసీఆర్ నిజంగా సమర్ధుడైతే తెలంగాణ ఇచ్చేది... తెచ్చే ది తామే అంటున్న కాంగ్రెస్‌పై పోరాడాలి. కానీ ఇందుకు భిన్నంగా తెలంగాణకు అడ్డుచెప్పమని స్పష్టంగా చెబుతున్న టీడీపీనీ టార్గెట్ చేయడం ఎందుకు? అన్నారు.

ప్రజల్లో టీడీపీకి బలం ఉంది. పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉంది. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది. దీని తో టీఆర్ఎస్ గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నా యి అన్నారు. పుట్టగతులు ఉండవని భయపడుతోంది. టీడీపీ సభలకు వచ్చి గొడవలు సృష్టిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ఎలాంటి ప్రేమ లేదు. సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. ఆయనకు సీట్లు, ఓట్లు, నోట్లు కావాలి. అది తప్పా వేరే వ్యాపకమే లేద అని విమర్శించారు.

నా రికార్డును బ్రేక్ చేయలేరు...: ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా నా ది 20 ఏళ్ళ చరిత్ర. దీనిని ఎవరూ రికార్డు చేయలేదరన్నారు. నా పాదయాత్ర రికార్డును కూడా ఎవరూ అధిగమించలేదరన్నారు. పాదయాత్ర సందర్భంగా చేతి వృత్తులపై ప్రధానంగా దృష్టి సారించారు. వారితో ఎక్కువగా మమేకం అయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఉదారంగా వరాలు కురిపించారు. నీరాను పానీయంగా విక్రయించే ఏర్పాటు చేస్తానని చెప్పారు. గీత కార్మికులకు తాడిచెట్ల పెంపకాని కి అయిదు ఎకరాలు ఇస్తానని హామీ ఇచ్చారు. చేతి వృత్తులను కాపాడేందుకు రూ 5వేల కోట్ల ను కేటాయిస్తానన్నారు.

ముదిరాజ్‌ల సంక్షేమానికి రూ 500కోట్లు ప్రత్యేకిస్తానని చెప్పారు. అంతకు ముందు పల్లారిగూడలో కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. సంగెం బహిరంగ సభ తర్వాత తిమ్మాపూర్ వరకు పాదయాత్ర చేశారు. రాత్రి అక్కడే బస చేశారు. టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, పబ్లిక్ ఎకౌం ట్స్ కమిటీ చైర్మెన్ రేవూరి ప్రశాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఈగ మల్లే శం, చల్లాధర్మారెడ్డి బాబు వెంట ఉన్నారు.

పల్లారు గూడలో శిలాపలకం: 1500 కిమీ పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా బాబు పల్లారుగూడలో శిలాపలకాన్ని ఆవిష్కరించారు. గుర్తుగా మొక్క నాటారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పల్లారుగూడ సమస్యను ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.