June 5, 2013

జగన్‌కు కిరణ్‌ సహకరం ఆయన వ్యతిరేకులపై కిరణ్‌ వేటు

వారిని వేర్వేరు జైళ్లలో పెట్టాలి
జగన్‌ వర్గంపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్య
టీడీపీ నాయకుడు నిప్పులు
  వైఎస్‌ జగన్‌తో కలిసి అక్ర మాలకు పాల్పడిన వారిని ఒకే జైలులో ఎందుకు పెడు తున్నారని, వారిని వేర్వేరు జైలులో పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి అన్నారు. అవిభక్త కవలలు వీణా వాణి మాదిరే.. జగన్‌కు కిరణ్‌ సహకరిస్తు న్నారని పేర్కొన్నారు. జగన్‌ ఎలాచెబితే అలా కిరణ్‌ నడుచు కుంటున్నట్లుగా కనిపిస్తోందని రేవంత్‌ ఆరోపించారు. జగన్‌ సహాయకుడు సునీల్‌ రెడ్డి జైల్లో జగన్‌కు సహాయ కుడిగా పని చేసేందుకే బెయిల్‌ పిటిషన్‌ కూడా వేయడం లేదని అర్థం అవుతోందని, వీరందరికీ సీఎం సహకరిస్తు న్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌ ఉన్న జైలుకే విజయసాయి రెడ్డి, ఐఎఎస్‌ అధికారులు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మీ లాంటి వారందర్నీ జగన్‌ ఉన్న జైలుకే తరలిస్తు న్నారంటే జగన్‌కు సీఎం కిరణ్‌ సహకరిస్తున్నట్లే కదా అని అన్నారు.

వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలపై సీఎం కిరణ్‌ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జగన్‌కు వ్యతిరే కంగా మాట్లాడుతున్న వారిని పదవుల నుండి దించి వేస్తున్న విషయం వాస్తవం కాదా? అని ఆయప ప్రశ్నిం చారు. జగన్‌కు వ్యతిరేకంగా బొత్స మాట్లాడినప్పు డు ఆయనపై లిక్కర్‌ కేసులు పెట్టలేదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శంకర్‌ రావును మంత్రి పదవి నుండి తొలగించి కేసులు నమోదు చేయించి వేధిస్తున్నారని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం దామోదర వద్ద ఉన్న వ్యవసాయశాఖను సీఎం తన పరిధిలోకి తెచ్చుకున్నది వాస్తవం కాదా? అని అన్నారు. బుధవారం టీడీఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

టీడీపీ హయాంలో పని చేసిన ఐఎఎస్‌ అధికారులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని, అదే వైఎస్‌ హయాంలో పని చేసిన అధికారులు బీపీ ఆచా ర్య, శ్రీలక్ష్మీ లాంటి వారు జైళ్లలో ఉన్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. జైలులో ఉన్న జగన్‌ను విడిపించుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీతో వైకాపా కుమ్మక్కయిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు పాలక పక్షాన్ని విమర్శి స్తాయని, కానీ దురదృష్ట వశాత్తూ టీఆర్‌ఎస్‌, వైఎస్‌స్సార్‌ సీపీ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీని వదిలేసి టీడీపీని విమర్శిం చడమే పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ పార్టీతో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలదా? ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం తెరిచి ఉంచిన పుస్తకమ న్నారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కు కావాల్సిన ఖర్మ వైకాపాకు పట్టిందేమో గానీ తమకు పట్టలేదన్నారు. షర్మిళ రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉందన్నారు. జగన్‌ను జైలు నుండి విడిపించుకునేందుకు ఒక తల్లిగా విజయమ్మ పడుతున్న తపన చూస్తుంటే ఏవరికైనా జాలేస్తుందని, నాడు కోట్ల రూపాయలు అక్రమంగా మూటగట్టుకుంటుంటే ఎందుకు మందలించలేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.