June 5, 2013

తెలంగాణపై స్పష్టతనిచ్చాం టీడీపీతోనే తెలంగాణ సాధ్యం

‘టీ’డీపీ దూకుడు
మహానాడులో రాజకీయ తీర్మానాలను తప్పుబట్టడం దుర్మార్గం
రీేకసీఆర్‌ లేఖ ఇస్తే చంద్రబాబుతో సంతకం చేరుుస్తామని టీ-ఫోరం సవాల్‌
టీఆర్‌ఎస్‌ దూకుడుకు కళ్లెం వేసేందుకు టీ-ఫోరం కసరత్తు
టీ-ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లో సమావేశాలు
  టీఆర్‌ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు తెలంగాణ ప్రాంత తెలుగు తమ్ముళ్లు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తెలంగాణవాదాన్ని అ డ్డం పెట్టుకుని తమను ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ను అదే అస్త్రంతో దెబ్బకొట్టాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. తెలంగాణవాదంపై గుత్తాధిపత్యాన్ని చలాయించాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ పట్ల దూకుడుగా వ్యవహరించడం ద్వారా ఆ పార్టీని నిలువరించవచ్చని టీ-ఫోరం నేతలు పథక రచన చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ ఈ మేరకు తెలంగా ణ ప్రాంత తెలుగు తమ్ముళ్లు తమ విమర్శలకు పదునుపెట్టి ఎదురుదాడిని తీవ్రతరం చేశారు. తెలంగాణ అంశంపై ఇప్పటికే పలుమార్లు స్పష్టతనిచ్చిన పదే, పదే తమ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న టీఆర్‌ఎస్‌ వైఖరిని ఎక్కడిక్కడ ఎండగట్టాలని నిర్ణయించారు.
తెలంగాణను అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, యువనేత రాహుల్‌గాంధీని పలె ్లత్తు మాట అనడానికి సాహసించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, రాజకీయలబ్ధి కోసం తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారన్నారంటూ మండిపడుతున్నారు. తెలంగాణ అంశం పట్ల ప్రతిసారి పార్టీ నిర్ణయాన్ని స్పష్టం చేస్తూనే ఉన్నా టీఆర్‌ఎస్‌ మాత్రం తమ విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉందని నిప్పులు చెరుగుతున్నారు. 2008లో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, అదే విషయాన్ని ఇటీవల కేంద్ర హోంమంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మరోసారి స్పష్టం చేయడం జరిగిందంటున్నారు. అయినా టీఆర్‌ఎస్‌ తన రాజకీయలబ్ధి కోసం టీడీపీపై విమర్శలు చేస్తూనే ఉందన్నారు. మహానాడు రాజకీయ తీర్మానాల్లో తెలంగాణ అంశాన్ని చేర్చి తమ చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నామ న్నారు. అయినా కూడా టీఆర్‌ఎస్‌ వైఖరిలో ఎటువంటి మార్పులేదని శివాలెత్తుతున్నారు. తెలంగాణ అంశంపై మహానాడులో చేసిన రాజకీయ తీర్మానాన్ని కూడా ఆ పార్టీ నేతలు తప్పుపట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమం టున్నారు.
తెలంగాణ సాధనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెబుతూనే, టీఆర్‌ఎస్‌ వైఖరిని తెలంగా ణ తమ్ముళ్లు తూర్పారబడుతున్నారు. తెలంగాణ పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకే మహానాడులో తీర్మానం చేశామని, మా నిజాయితీని నిరూపించుకునేందుకు ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించుకుం టామని చెబుతున్నారు. ఒవైపు తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటూనే, మరోవైపు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తామని ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాక ర్‌రావు చెప్పారు. తెలంగాణ వనరులు కాంగ్రెస్‌ పార్టీ దోచుకుపోతుంటే కేసీఆర్‌ ఏమి చేశారని ప్రశ్నించారు. బాబ్లీ అక్రమ నిర్మాణంపై, బయ్యారం గనుల పరిరక్షణ కోసం టీడీపీ ఉద్యమించినప్పుడు కేసీఆర్‌ ఎక్కడ పడుకున్నారంటూ అపహాస్యం చేశారు. తెలంగాణ సాధన కోసం టీ-ఫోరం ఆధ్వర్యంలో త్వరలోనే అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
తెలంగా ణ సాధన కోసం తమ వైఖరిని విస్పష్టంగా ప్రకటిస్తూనే, మరోవైపు టీఆర్‌ఎస్‌పై పదునైన విమర్శల దాడిని టీ-ఫోరం నేతలు కొనసాగిస్తున్నారు. గత 12ఏళ్లుగా తెలంగాణ ప్రజలను టీఆర్‌ఎస్‌ మోసం చేస్తోందని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఓట్లు, సీట్లు, నోట్ల చుట్టే ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఇదిగో తెలంగాణ.. అదిగో అంటూ 1000మంది దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థి, యువకుల ప్రాణాలు తీశారన్నారు. తెలంగాణకు కాపలా కుక్కనని చెప్పుకునే కేసీఆర్‌, సోనియాగాంధీ ఇంటి కాపలా కుక్క మాదిరిగా వ్యవహరి స్తున్నారని ధ్వజమెత్తారు. అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ఇచ్చిన లేఖ సరిపోదంటే, కేసీఆర్‌ ఓ లేఖ రాసి తీసుకువచ్చి ఇస్తే దానిపై చంద్రబాబు చేత సంతకం చేయిస్తామంటూ టీ-ఫోరం నేతలు సవాల్‌ విసురుతున్నారు. టీడీపీని ఇరకా టంలో పెట్టేందుకు టీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీష్‌రావు చేసిన విలీన ప్రతిపాదన ఆ పార్టీ మెడకే చుట్టుకుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారం లోకి వచ్చిన వెంటనే తెలంగాణపై తీర్మానం చేయాలని, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడితే భేషరతుగా మద్దతు నివ్వాలంటూ, టీ- ఏర్పడగానే దళితున్నే ముఖ్యమంత్రి చేయాలన్న హరీష్‌రావు ప్రతిపాదనలకు టీడీపీ సాను కూలంగా స్పందించింది. పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటుచేసి విలీన ప్రతిపాదనపై చర్చించి, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ చేత ప్రకటన చేయించాలని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి సూచించారు. చంద్రబాబు అనుమతితోనే ఈ అంశంపై తాను స్పందిస్తున్నానని చెప్పి టీఆర్‌ఎస్‌ను ఆత్మరక్షణలో పడేశారు. దీనిపై ఆ పార్టీ నేత లు ఎవరు ముందుకు వచ్చి స్పందించకపోవడంతో, స్వయంగా హరీషే రంగంలోకి దిగి తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సరిగ్గా అర్ధం చేసుకోలేదంటూ వివరణిచ్చే ప్రయత్నం చేశారు.
ఇలా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంగాలో టీడీపీ, టీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ప్రాంతంలో తమ పట్టు నిలుపుకునేందుకు ఈ రెండు రాజకీయ పక్షాలు తీవ్రస్థాయిలో మాటల యుద్ధాన్నికొనసాగిస్తున్నాయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌లోకి, టీఆర్‌ఎస్‌ నుండి టీడీపీలోకి వలసలు కొనసాగుతుండడంతో ఇరు పార్టీల నాయకత్వం తమ ఉనికిని కాపాడుకునేందుకు ఒకరిపై, ఒకరూ విమర్శలు చేసుకుంటూ పైచేయి సాధించాలని ఎత్తుగడలు వేస్తున్నారన్నారు.