February 25, 2013

బాబే శ్వాసగా.. ధ్యాసగా..


రాష్ట్రంలోని అత్యంత సంపన్నుల్లో ఆ యన ఒకరు... అనేక పరిశ్రమలకు అధిప తి... ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఆ యన ఒకరి మాటకు కట్టుబడి ఉంటారు. ఆయనే గరికపాటి మోహనరావు... తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... చంద్రబాబే శ్వాసగా.. ధ్యాసగా ఆయన వెన్నంటే ఉంటూ వస్తున్నా మీకోసం పాదయాత్రకు సారధ్యం వహిస్తున్నారు. బాబు పాదయాత్ర 145 రోజులుగా ప్రశాంతం గా, ఇబ్బందులు లేకుండా ఓ ప్రణాళిక ప్రకారం సాగిపోవటానికి కారణమైన వ్యక్తుల్లో గరికపాటి ఒకరు.

చంద్రబాబు పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ఎక్కడికక్క డ టీమ్ మొత్తం బస చేస్తుంది. ఆ శిబిరం నిర్వహణను గరికపాటి మోహనరావు చూసుకుంటారు. అక్కడే చంద్రబాబు ఒక బస్సులో నిద్రిస్తే, ఆ పక్కనే మరో బస్సులో గరికపాటి నివాసం ఉంటుంది. బాబు ఉదయం రెడీ అయ్యేలోగా గరికపాటి సిద్ధంగా ఉంటారు. ఈలోగా చంద్రబాబు రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడాల్సిన పనులు కూడా మోహనరావుకు చెబుతుంటారు. వారితో మాట్లాడి ఆ సమాచారాన్ని తిరిగి చంద్రబాబుకు చెబుతారు.

30 ఏళ్లుగా బాబు వెంటే... ముప్పై ఏళ్లుగా పార్టీలో ఉండి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా గరికపాటి మాత్రం సింపుల్‌గా ఉంటారు. పార్టీలో ఎన్ని పనులు చేస్తున్నా తెరపై కనిపించే వ్యక్తి కాదు. టీడీపీ నిర్వహించిన యువగర్జన, మహానాడు, బాబ్లీ ఉద్యమంలోనూ గరికపాటి కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండే ఆయన ఏనాడూ పదవుల కోసం ఆశించలేదు. అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీలో ఏ పని అప్పగిస్తే ఆ పనికి నూరుశాతం న్యాయం చేసేందుకు ఆరాటపడతారు. గతంలో బాబు గొంతు సమస్యతో బాధ పడుతున్న సమయంలోనూ గరికపాటి మోహనరావే బాబు తరపున టెలికాన్ఫరెన్స్ నిర్వహించా రు. 2004లో చంద్రబాబు ఓటమి పాలై గవర్నర్‌కు రా జీనామా పత్రం అందజేసిన సమయంలో అరగంట క్రితం ఎ లా ఉన్నారో(సీఎం) అలా చూసే వరకు మీ వెంటే ఉంటాన ని చంద్రబాబుతో చేసిన వాగ్ధానాన్ని మరచిపోలేదు.

ఆ లక్ష్యం కోసమే చంద్రబాబు చేపట్టిన ఏ కార్యక్రమంలోనైనా ముందంజన నిలుస్తారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆరంభం నుంచి బాబుతోనే కొనసాగుతున్నారు. వ్యాపారా లు కుటుంబీకులకు అప్పగించి తాను పాదయాత్రలో పా ల్గొంటున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన గరికపాటి, వ్యవహార శైలి సాధారణంగానే ఉంటుంది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అందరితో ఇట్టే కలిసిపోతారు. పార్టీలో జూనియర్ల నుంచి సీనియర్ల వరకు గరికపాటి అంటే తెలియనివారు ఉండరు. పబ్లిసిటీకి ఆయన ఆమడ దూరంలో ఉంటారు. పార్టీ జెండా అంటే ఆయనకు ప్రాణం. నాయకుడి మాట శిరోధార్యం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భా వం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు.

వేధింపులు ఎదురైనా... చంద్రబాబుకు గరికపాటి అత్యంత సన్నిహితుడని గ్రహించిన వైఎస్ అతనిని బాబు నుంచి తప్పించేందుకు సామ,దాన, బేధ దండోపాయాలు ఎన్నో ప్రయోగించారు. బాబు సన్నిహితుల్లో ఎంతోమందికి ఏదొక లబ్ధి చూపించి తమవైపు మార్చుకోగలిగారు. అందుకు గరికపాటి వ్యతిరేకత వ్యక్తంచేయటంతో వేధింపులు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆయనను అరెస్టు చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో గరికపాటి అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. తప్పు డు కేసుల్లో అరెస్టు చేయించే ప్రయత్నాలు జరిగినా, మోహనరావు తన పంథా మార్చుకోలేదు. తాను నమ్మిన పార్టీని, తనను నమ్మే నేతను వీడలేదు. .

జిల్లాల్లో ఎక్కడైనా వివాదా లు తలెత్తితో చంద్రబాబు మొదట గుర్తొచ్చే వ్యక్తుల్లో గరికపాటి ఒకరు. అందుకే వివాదరహితుడైన గరికపాటికి ఆయా కీలక బాధ్యతలు అప్పగిస్తుంటారు. రాజ్యసభకు వెళ్లేందుకు మూడు సార్లు అవకాశం వచ్చినా, సామాజిక కారణాల రీత్యా చంద్రబాబు వేరొకరికి కేటాయించినా గరికపాటి బాబు మాటే శిరోధార్యమన్నారు. పదవుల కోసం వెంపర్లాడే ప్రస్తుత తరుణంలో చంద్రబాబు ఆదేశాన్ని తూచా తప్పక పాటిస్తూ రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని వదులుకున్నారు. తనకు ఇది కావాలని ఏనాడు అడగని గరికపాటి, పార్టీలో ఏదీ ఆశించకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్రకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ బాబుతో పాటే ముందుకు సాగుతున్నారు. ఇంచుమించు చంద్రబాబు వయసే ఉన్నా ఎటువంటి అనారోగ్యం లేకుం డా ఉత్సాహంగా ముందుకు నడుస్తున్నారు.. పాదయాత్ర బృందాన్ని నడిపిస్తున్నారు.

పార్టీలోకి ఇలా వచ్చి అన్ని పదవులు, హోదాలు అనుభవించి తమను పైకి తెచ్చిన అధినేతనే తిట్టిపోసే నాయకులకు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం ముఖ్యమని నమ్మే గరికపాటి మోహనరావు లాంటి నేత స్ఫూర్తిదాత అనడంలో ఆశ్చర్యం లేదు.