December 26, 2012

ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం




ప్రభుత్వం ఉందా? లేదా? నకిలీ వి త్తనాలు, కల్తీ ఎరువులు, కరెంటు సమస్యలతో సతమతమవుతున్నామని, జా క్‌పాట్ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి కష్టా లు, నష్టాలు తెలియవని, పోరగాండ్ల తో ఆడుకొనే వ్యక్తిని సీఎం చేయడం వ ల్ల మాకు సమస్యలు తలెత్తాయని, క ష్టాల్లో కూరుకపోయామని, మమ్మల్ని ఆదుకునేదెవరో.. అని రైతులు మాళ్ల శ్రీనివాస్, మధు చంద్రబాబునాయుడి ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మొండె ద్దు ప్రభుత్వమని, రైతుల సమస్యలు వీరికి పట్టవని, అవినీతి పెరిగిపోయిందని, ధరలు ఆకాశాన్నంటాయని, కూ కటి వేళ్లతో ఈ ప్రభుత్వాన్ని పీకి బంగా ళాఖాతంలో పడేయాలని చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా మీ కో సం.. పాదయాత్రలో భాగంగా 11వ రోజు మంగళవారం ఆయన సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట, ఓదె ల మండలం గోపరపల్లి, కొలనూర్, కా ల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామాలమీదుగా గంగారం క్రాస్‌రోడ్ వరకు 14.4 కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టారు. రేగడి మద్దికుంటకు వెళ్లగానే ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు వే సిన టెంట్ వద్దకు చేరుకొని వివేకానందుడి చిత్రపటానికి పూలమాల వేసి ని వాళులర్పించారు. వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ప్ర సంగాలు ఈ దేశ ప్రజలకు ధైర్యాన్నిచ్చాయని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. కొలనూర్‌లో చర్చిలో క్రిస్‌మస్ వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. రైతులు, మహిళలు, యువకులు ఆయనకు తాము పడుతు న్న కష్టాలను, ప్రభుత్వం అనుసరిస్తు న్న వైఖరిపై వివరించారు. ఆయా సభ ల్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నా యకులు పంది కొక్కుల్లా మారి దోచు కుతింటున్నారని, తెలుగుదేశం పార్టీ పాలనలో మంచి పనులు చేశామని తెలిపారు. మంచినీటి పథకాలు, 9గం టల కరెంటు ఇచ్చామని, ట్రాన్స్‌ఫార్మ ర్ కాలిపోతే 24 గంటల్లోనే అమర్చామని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అం దుకు భిన్నంగా ఉందని, ఉద్యోగాలు పోయాయని, మౌలిక వసతులు కరువయ్యాయని, రోడ్లు, మురికి కాలువలు లేవని, వీధి దీపాలు వెలిగే పరిస్థితి లేదన్నారు. నేను వస్తున్నానని ఆయా గ్రా మాల్లో కరెంటు ఇస్తున్నారని, ఆ తర్వా త ఇవ్వడం లేదన్నారు. అవినీతిపై ప్ర తి ఒక్కరూ రాజీ లేని పోరాటం చేయాలని అన్నారు.

తాము అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే వరకు నిరుద్యోగ భృతిని అం దిస్తామని చెప్పారు. మహిళల్లో ఆత్మ స్థైర్యం పెంచేందుకు డ్వాక్రా సంఘా లు పెట్టి పొదుపు చేయించి రివాల్వింగ్ ఫండ్ అందజేశామని అన్నారు. పావ లా వడ్డీ అని చె ప్పి వడ్డీల మీద వడ్డీలు వేయ డం వల్ల రుణ భారం పెరిగిపోతుందని అన్నా రు. నిత్యావసర వస్తువులు, కరెం టు ఛార్జీలు, ఆ ర్టీసీ బస్సు ఛార్జీ లు, పెట్రోల్, డీ జిల్ ధరలు పె రుగుతున్నాయే తప్ప పేద, మ ధ్య తరగతి ప్రజల ఆదాయం మాత్రం పెరగడం లేదని అన్నారు. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ దొంగలు దోచుకోవడం వల్ల మనకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

11 సార్లు డీఎస్సీ పెట్టి లక్షా 65వేల మందికి ఉద్యోగాలు క ల్పించామని, ఇప్పుడేమో బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీకి అర్హత లేకుండా చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కల్పిస్తామని హామీ ఇచ్చారు. గీత కార్మికు లు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, గొర్రెలకాపర్లు, ఆయా వెనకబడిన కు లాల వారిని ఆదుకునేందుకు 10వేల కోట్ల రూపాయలతో సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చే పట్టి మాదిగ ఉప కులాలకు న్యాయం చేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని, సామాజిక న్యాయం చేసే పార్టీ అని అన్నారు. పేదవాళ్లకు రాజ్యాధికారం కల్పించి పేదరిక నిర్మూలన చేపడతామని, ఆడమగ పిల్లలకు సైకిళ్లు ఉచితంగా అందజేస్తామని ఆ యన చెప్పారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం రైతుల రు ణాల మాఫీపై పెడతామని, రెండవ సంతకం బెల్ట్‌షాపులను పూర్తిగా ఎత్తివేసే ఫైల్‌పై, మూడవ సంతకం ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా రక్షిత మం చినీటిని అందించే ఫైల్‌పై సంతకం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి, చొప్పదం డి ఎమ్మెల్యేలు సీహెచ్ విజయరమణారావు, సుద్దాల దేవయ్య, ఎమ్మెల్సీ నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు కర్రు నాగయ్య, గోపు ఐలయ్యయాద వ్, గండ్ర నళిని, డాక్టర్ కవ్వంపల్లి స త్యనారాయణ, పి రవీందర్‌రావు, పుట్ట కిషోర్, జిల్లా ప్రధానకార్యదర్శి వాసాల తిరుపతి, రాష్ట్ర కార్యదర్శులు అన్నమనేని నర్సింగరావు, బోనాల రాజేశం, నాయకులు గోపగాని సారయ్యగౌడ్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, నీరటి శ్రీ నివాస్, కల్యాడపు ఆగయ్య, గంట రా ములు, అక్కపాక తిరుపతి, సంకు సు ధాకర్, పాల రామారావు, మినుపాల ప్రకాశ్‌రావు, మూల ప్రేంసాగర్ రెడ్డి, వంగళ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అక్కడక్కడా టీఆర్ఎస్ కార్యకర్తల నిరసనలు: చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో జై తెలంగాణ.. అనాలని, తెలంగాణపై స్పష్టమైన వైఖరిని తెలపాలని టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రేగడి మద్దికుంట గ్రా మంలో చంద్రబాబు ప్రసంగిస్తుండ గా, జై తెలంగాణ.. అంటూ వచ్చిన న లుగురు కార్యక ర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెగడపల్లి గ్రా మంలో రాత్రి 9.30గంటల ప్రాంతం లో పాదయాత్ర చేస్తుండగా, చంద్రబాబుపైకి కొందరు వ్యక్తులు రెండు కోడి గుడ్లను విసరగా, అవి పక్కకు ప డ్డాయి.