December 26, 2012

చివరి భూములకు నీరందించిన ఘనత టీడీపీదే..



 
రైతు సంక్షేమమే లక్ష్యంగా, వారి అభివృద్ధే ధ్యేయంగా తాను తెలంగాణ ప్రాంత రైతుల ప్ర యోజనార్ధం ఎస్సాఎస్పీ కాలువలకు సీసీ పనులకు శ్రీకారం చుట్టి 16లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నా రు. వస్తున్నా మీకోసం.. పాదయాత్రలో భాగంగా మండలంలోని రేగడిమద్దికుంట బస్టాండ్ చౌరస్తా వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన సభలో బాబు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతాంగం అదోగతి పాలైందని, రైతు అవసరాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని అన్నారు. రేగడి మద్దికుంటలోనే ఇన్ని సమస్యలుంటే ఇక వేరే గ్రామాల గురించి చెప్పుకోనక్కర్లేదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణారావుతోపాటు టీడీపీ నాయకులు నోముల రాజేశ్వర్‌రెడ్డి, రాజిరెడ్డి, కౌశిక్, సాయిరి మహేందర్, పాల రామారావు, కుమార్ కిషోర్, అబ్బయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ నేతల తెలంగాణ నినాదాలు..: బాబు సభ మద్దికుంటలో సజావు గా సాగి పాదయాత్రకు మళ్లీ సిద్ధమవుతుండగా, మద్దికుంట గ్రామానికి చెం దిన టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు గట్టు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మెం గని రామకృష్ణ, ముత్యాల అనిల్, ఈర్ల తిరుపతి, పల్లా శ్రీనివాస్, నరేశ్, సతీష్, శనిగరపు సదయ్య, తదితర యువకులు జై తెలంగాణ..అంటూ ని రసన తెలిపారు. వెంటనే అప్రమత్తమై న పోలీసులు వారిని పక్కకు తోసేశారు.

వివేకానందుడు యువతకు స్ఫూర్తిదాయకం: దేశ యువతకు వివేకానందుడు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, యువతలో ఆయన తీసుకువచ్చిన చైతన్యం, ఉపన్యాసాలకు ప్రపంచ ఖ్యాతి లభించిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. మండలంలోని రేగడిమద్దికుంట గ్రామంలో రోడ్డు పక్కన ఫ్రెండ్స్ యూత్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన శిబిరంలో చంద్రబాబు వివేకానందుని చిత్రపటానికి పూమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగిస్తూ వివేకానందుడు చూపిన ధైర్య సాహసాలు, తెగువ ప్రజల్లో కలిగించిన చైతన్య స్ఫూర్తి మరిచిపోలేనిదన్నారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు, నోముల రాజేశ్వర్‌రెడ్డి, సాయిరి మహేందర్, పాల రామారావు, కుమార్ కిషోర్, వేగోళం అబ్బయ్య గౌడ్, తౌషిక్‌తోపాటు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సతీష్, ప్రకాశ్ రెడ్డిలు పాల్గొన్నారు.