December 26, 2012

కాంగ్రెస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది




కాంగ్రెస్ ప్రభు త్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపో యి ధరలు చుక్కలనంటాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నా రు. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం.. పాదయాత్ర మండలంలోని పెగడపల్లి సబ్‌స్టేషన్ నుంచి పెగడపల్లి, గంగారం గ్రామాల వరకు మంగళవారం రాత్రి సాగింది. పెగడపల్లి, గం గారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం నీళ్లు, కరెంటు ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. నిత్యావసర ధరలు పెరగడంతోపాటు సర్‌ఛార్జిల పేరిట విద్యుత్ వినియోగదారులపై భారం వేసి బిల్లులు వసూ లు చేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డీఏపీ ధర రూ. 400 ఉంటే ప్రభుత్వం రూ. 1280కి పెరిగిందన్నారు. టీడీపీ పాలనలో 1500 కోట్లతో కాలువలకు సిమెంట్ లైన్‌లు వేయించానని, ప్రస్తుత ప్రభుత్వ పాలనలో చివరి భూములకు ఎస్సారెస్పీ కా లువ నీరందించిన పాపాన పోలేదన్నా రు. ఆనాడు కరువున్నా 9 గంటల వి ద్యుత్ రైతులకు అందించానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వెయ్యి లా రీల డబ్బును అవినీతితో సంపాదించుకున్నారన్నారు. ఈకార్యక్రమంలో టీడీ పీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విజయరమణారావు, జిల్లా ఉపాధ్యక్షుడు గోపగాని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు వంగళ తిరుపతిరెడ్డితోపా టు టీడీపీ పార్టీ పరిశీలకులు అడిచినపల్లి విద్యాసాగర్‌రావులు పాల్గొన్నారు.

మీరు తెచ్చిన కంప్యూటర్ల ద్వారా ఎంతో జ్ఞానం సాధించాం..

మీరు సీఎంగా ఉన్న కాలంలో మీ రు తెచ్చిన కంప్యూటర్ల ద్వారా ఎంతో జ్ఞానం సాధించామని పెగడపల్లి గ్రా మానికి చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి మౌనిక చంద్రబాబుతో చెప్పింది. ఎన్నో ప్రాజెక్టుల ద్వారా టె క్నాలజీ అభివృద్ధి చేశారు. వీటి ద్వారా ఇంటింటికి సెల్ ఫోన్‌లు కూడా వచ్చాయన్నారు. టెక్నాలజీ ద్వారా మనకు రాష్ట్రానికి టెలీఫోన్‌లను తీసుకురావ డం జరిగిందన్నారు. కంప్యూటర్ టె క్నాలజీ ద్వారా ఎందరికో ఉపాధి కూ డా కల్పించానని బాబు పేర్కొన్నారు.