December 25, 2012

సుల్తానాబాద్‌లో బాబు సభ సక్సెస్




వస్తున్నా మీకోసం.. పాదయాత్రలో భాగంగా సుల్తానాబాద్‌లో నిర్వహించిన చంద్రబాబు సభకు విశేష స్పందన లభించిం ది. టీడీపీకి గట్టి పట్టున్న ఈ నియోకవర్గంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సుల్తానాబాద్ రోడ్లు పూర్తిగా పసుపుమయంగా మా రాయి. చంద్రబాబు కోసం రెండు గం టలకు పైగా వేచి చూసిన వేలాది జనం బాబు రావడంతోనే ఒక్కసారిగా ఆకా శం దద్దరిల్లేలా బాబుకు ఘన స్వాగ తం పలికారు. ప్రత్యేక బస్సుపై స్థానిక నెహ్రూ చౌరస్తా, రాజీవ్‌రహదారిపై నిర్వహించిన చంద్రబాబు సభలో దా దాపు రెండు గంటలపాటు అనర్గళంగా కాంగ్రెస్ అవినీతి పాలనపై, తెలంగాణపై దాటవేసే, సాగదీసే వైఖరి, ధోరణిని వివరిస్తూ ప్రసంగించారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ ఇలాంటి పార్టీలేవీ మీ కష్టాలను తీర్చేవ కావని, టీడీపీ ద్వారానే మళ్లీ మీకు మంచి రోజులు వ స్తాయని విడమర్చి చెప్పడంతో ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతించారు. బాబు సభ ద్వారా రాజీవ్‌రహదారి పూర్తిగా స్తంభించి పోవడంతో ఇటు కాట్నపల్లి వరకు, అటు సుగ్లాంపల్లి వరకు రాకపోకలు స్తంభించాయి. పోలీసులు వాహనాల రాకపోకలను పూ సాల ద్వారా, చె రువు రోడ్డు ద్వారా మళ్లించి కొంత రద్దీని తగ్గించారు. ఇదే జనాన్ని చూసి బాబు కూడా తన ప్రసంగాన్ని సుదీర్ఘంగా కొనసాగించడం గమనార్హం.

వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన చంద్రబాబు..

చొప్పదండిలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వికలాంగులు బాబును కలిసి తమకు ప్రభుత్వం ఎలాంటి సా యం చేయడం లేదని విన్నవించుకోవడంతో చలించిన చంద్రబాబు రామడుగుకు చెందిన బత్తిని ఆంజనేయులు, గోలి రామయ్యపల్లికి చెందిన పులిపాక శ్రీనివాస్‌లకు ఎన్టీఆర్ ట్రస్టు నుంచి రెండు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. అ లాగే సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన మద్దెల రాజు అనే వికలాంగుడు సైతం నాకు ఉపాధి చూపించం డి.. ట్రై సైకిల్ ఇప్పించండి అని వేడుకోవడంతో స్పందించిన బాబు అప్పటికప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు నుంచి ట్రైసైకిల్ ను రాజుకు అందించారు.

బాబు యాత్రలో నిరసనలు

బాబు పాదయాత్రలో భాగంగా కాట్నపల్లి వద్ద కొంత మంది తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే సుల్తానాబాద్‌లో తెలంగాణ శిబిరం వద్ద టీఆర్ఎస్ నాయకులు మౌన దీక్షలో పాల్గొని తమ నిరసన తెలిపారు. కాంపెల్లి నారాయణ, సర్వర్, గడ్డం సత్యనారాయణ, సాతూరి రాజేశం, కోటి, గందె మల్లికార్జున్‌లు నోటికి గంతలు కట్టుకొని, చెవులు మూసుకొని నిరసన తెలిపారు.

బాబుకు తల్వార్‌ను బహూకరించిన కోడూరి

సుల్తానాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబుకు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కో డూరి చంద్రశేఖర్ తల్వార్‌ను బహూకరించారు.

బాబుకు వినతులు వెల్లువలు..

పాదయాత్ర పొడగునా చంద్రబాబు కు వివిధ వర్గాల వారు తమ సమస్యల గురించి వినతిపత్రాలు సమర్పించారు. ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వారు వేతనాల పెంపుపై చంద్ర బాబుకు విన్నవించారు.