December 25, 2012

సమస్యలు అడిగి.. సమాధానాలిచ్చిన బాబు..



సమస్యలు అడిగి.. సమాధానాలిచ్చిన బాబు..

పెద్దపల్లి: వస్తున్నా మీకోసం.. పేరిట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం సుల్తానాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలను వారినుంచే రాబట్టి వా టికి తగిన సమాధానాలిచ్చారు. విద్యు త్ సమస్య, అవినీతి, ఎస్సీ వర్గీకరణ, తె లంగాణతోపాటు పలు అంశాలపై సభికుల నుంచి ప్రశ్నలు తెప్పించుకొని వా టికి సమాధానాలిచ్చారు.

కరెంటు సమస్య తొలగించండి..- రాజేశ్వర్‌రెడ్డి, లాలపల్లి

ఎలిగేడు మండలంలో కరెంటు బా ధలు తొలగించండి.. ఏఈని అడిగితే ఏ డీ అంటాడు. ఏడీని అడిగితే డీఈ అం టాడు. దీనికి విముక్తి లేదా.

బాబు: మేం అధికారంలోఉన్నపుడు రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను సాధించాం. మీ ఎమ్మెల్యే పోరాటాలతోనే మీకు ఈ మాత్రమైనా కరెంటు వస్తోంది.

వర్గీకరణతో న్యాయం చేయండి- మాతంగి ఓదెలు, ఎమ్మార్పీఎస్ నాయకుడు

వర్గీకరణతో మాదిగలు, ఉపకులాలకు న్యాయం చేయాలి. విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చి జాతి అభివృద్ధికి కృషి చేయాలి.

బాబు: తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆ మోదించాం. ఈ కారణంగానే వేలాది మంది మాదిగ కులస్తులకు విద్యా, ఉ పాధి అవకాశాలు దక్కాయి.

తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి..- అశోక్, డిగ్రీ విద్యార్థి, పెద్దపల్లి

తెలంగాణకు టీడీపీ వ్యతిరేకమని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై పార్టీ పరంగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.

బాబు: నేను ఎవరికి వ్యతిరేకం కా దు. తెలంగాణను ఇప్పటివరకు అడ్డుకోలేదు. భవిష్యత్తులో కూడా అడ్డుకోం.