December 24, 2012

జన హోరు...




సిటీ/ సుల్తానాబాద్/పెద్దపల్లి): 'పసుపుమయమైన రాజీవ్ రహదా రి.. అడుగడుగునా నీరాజనాలు.. మ హిళల మంగళ హారతులు..డప్పుల చ ప్పుళ్లు..ఒగ్గు డోలు వాయిద్యాలు..గంగిరెద్దుల ఆటలు..సింధోళ్ల వేషాలు.. కి క్కిరిసిన సుల్తానాబాద్ సభ.. వెరసీ సోమవారం జరిగిన చంద్రబాబు పా దయాత్ర జాతరను తలపించింది. ఈ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహం వల్ల ఇబ్బందులు పడుతున్నారు.. మీరు న మ్ముకున్న పార్టీలు మిమ్మల్ని మోసం చేశాయి.. కరెంట్ లేదు.. ఉద్యోగాలు లేవు.. మీ కష్టాలకు కారకులెవ్వరో ఆ లోచించండి.. నేను చెప్పేది వాస్తవమై తే నమ్మండి'.. అని టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా సోమవారం వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జి ల్లాలోని సుల్తానాబాద్ మండలం న ర్సయ్యపల్లి, కాట్రపల్లి, పూసాల క్రాస్ రోడ్, సుల్తానాబాద్, గొల్లపల్లి, రేగడిమద్దికుంట వరకు 13.4 కిలోమీటర్లు నడిచారు. రాజీవ్ రహదారి మీదుగా సాగిన ఈ యాత్ర అంతా పసుపుమ యమైంది. యాత్రకు ఆయా గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివ చ్చారు. అడుగడుగునా నీరాజనాలు పలికారు.

మధ్యాహ్నాం ఒంటి గంటకు పాదయాత్రను మొదలెట్టారు. మార్గమధ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. కాట్రపల్లిలో ప్రజ లు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సుల్తానాబాద్‌లో ముస్లిం లు, ఆయా కులాలకు చెందిన వాళ్లు ఆ యనను కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతిప త్రాలు అందించారు. సుల్తానాబాద్‌లో జరిగిన బహిరంగసభలో చంద్రబాబు ఉత్సాహంగా మాట్లాడారు. కార్యకర్త లు కిరీటం పెట్టి కత్తి అందించారు. కర్రతో చేసిన చిన్న ఎడ్లబండి బహూకరించారు.

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనపై దుమ్మెత్తి పో శారు. టీఆర్ఎస్ తీరును ఎండగట్టిన ఆయన వైఎస్ఆర్ పార్టీపైనా విరుచు కుపడ్డారు. తొమ్మిదేళ్లుగా ఈ ప్రభు త్వం అసమర్థ పాలన సాగిస్తున్నదని, ప్రజల కష్టాలు చూడలేకనే దేశంలో ఏ నాయకుడు చేయలేని విధంగా దాదా పు 1350 కిలోమీటర్లు పాదయాత్ర చే సుకుంటూ వచ్చానని.. పొలాలకు వె ళ్లాను.. ఇళ్లళ్లకు, గుడిసెలకు వెళ్లాను.. మీ కష్టాలు చూస్తే గుండె తరుక్కుపో తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ కష్టాలను తీర్చాల్సిన ఈ ప్రభుత్వం క ష్టాలను సృష్టించిందన్నారు. వ్యవసా య ఖర్చులు బాగా పెరిగి పోయాయ ని కరెంట్ ఇవ్వడం లేదని.. ఎరువుల ధరలు పెరిగాయని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. పొద్దం తా కష్టపడితే వచ్చే 100 రూపాయల తో కిలో నూనె కూడా రావడం లేదని ఉప్పులు, పప్పులు అన్నీ ధరలు పెరిగాయి కానీ పేద, మధ్యతరగతి కు టుంబాల ఆదాయం పెరగలేదని అ న్నారు. వ్యవసాయానికి 9 గంటల క రెంట్ ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇ చ్చారు. సర్‌చార్జీల భారంవల్ల బిల్లులు అడ్డగోలుగా వస్తున్నాయన్నారు. కరెం ట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పో తుందో ఆ భగవంతుడికే తెలియాలన్నారు. తెలుగుదేశం పాలనలో సం స్కరణలు తీసుకువచ్చి జవాబుదారీ తనాన్ని పెంచామన్నారు. అవినీతికి పాల్పడాలంటేనే భయపడే వాళ్లని కా నీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వి చ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదన్నారు. ఎస్సారెస్పీ ఆధునీకీకరణకు ఈ జిల్లాలో 1500 కోట్ల రూపాయల ఖర్చు చేశామని గుర్తు చేశారు.

బాబ్లీ ప్రాజెక్టు మరో 14 ప్రాజెక్టుల వల్ల శ్రీ రాంసాగర్‌లోకి నీళ్లు రాక ఈ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి వచ్చిందన్నా రు. అక్రమ నిర్మాణాలపై తాము పో రాడితే అర టీఎంసీయే కదా అని టీఆర్ఎస్ కొట్టేసిందని, బాబ్లీ కట్టుకుంటే మనకు నష్టమేమిటని కాంగ్రెస్ అంద ని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో, మ హారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రె స్ పార్టీ బాబ్లీని ఆపకపోవడం సిగ్గు చే టు అని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధర ల్ని 28 సార్లు పెంచారని, మహిళల శ్రమను దోచుకుంటున్నారని పావలా వడ్డీ అని చెప్పి రూపాయి, రెండు రూ పాయలు వసూలు చేస్తున్నారని అన్నా రు. వంట గ్యాస్‌కు 6 సిలిండర్ల పరిమి తి పెట్టి గ్యాస్ ధరలు పెంచారని పేర్కొన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల పంట రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని, డ్వా క్రా మహిళల అప్పులను తీర్చే విషయ మై ఆలోచన చేస్తానని హామీ ఇచ్చారు. బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు ఇస్తామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతామని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు ఇస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపతామన్నారు. టీఆర్ఎస్ బ్లా క్ మెయిల్ చేసే పార్టీ అని సాగునీరు, కరెంట్, విద్య, వైద్యం గురించి ఏనా డు పట్టించుకోలేదన్నారు. వైఎస్ఆర్ పార్టీ అవినీతి పార్టీ అని విమర్శించా రు. 'కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ వై.. అభివృద్ధికి నై.. అవినీతికి సై' అని చమత్కరించారు. నా పట్ల మీరు చూపుతున్న ఆదరణను నా జీవితంలో ఎన్నడూ మర చిపోనని చంద్రబాబు నాయుడు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పెద్దప ల్లి, కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యేలు సీహెచ్ విజయరమణారా వు, గంగుల కమలాకర్, సుద్దాల దేవ య్య, ఎల్ రమణ, నిజామాబాద్ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం, నియోజకవర్గ ఇన్‌చార్జీలు కర్రు నాగయ్య, గండ్ర నళిని, పి రవీందర్‌రావు, పుట్ట కిశోర్, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, గోపు అ యిలయ్య యాదవ్, జిల్లా ప్రధాన కా ర్యదర్శి వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రాజేశం, అన్నమనేని నర్సింగరావు, తాజుద్దీన్, జిల్లా బీసీ, ఎస్సీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు అడ్డగట్ల లక్ష్మీనారాయణ, అక్కపాక తిరుప తి, ఎండీ మస్రత్, జిల్లా ఉపాధ్యక్షులు గోపగాని సారయ్య గౌడ్, కళ్యాడపు ఆ గయ్య, అధికార ప్రతినిధులు సాయిరి మహేందర్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, గూడెల్లి తిరుపతి, నాయకురాళ్లు గంగం రజిత, అమీనా బేగం, పెద్దప ల్లి నియోజకవర్గ నాయకులు ఆకుల నర్సయ్య, మినుపాల ప్రకాశరావు, కు మార్ కిశోర్, అమిరిశెట్టి తిరుపతి, అ బ్బయ్య గౌడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు పాల రామారావు, గంట రాములు, ఎ విద్యాసాగర్ రావు తదితరులు ఉన్నారు.

బాబు కాలికి బొబ్బలు..: జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చం ద్రబాబు నాయుడు సోమవారం కొత్త బూట్లు ధరించడం వల్ల ఆయన ఎడ మ కాలికి బొబ్బలు వచ్చాయి. సుల్తానాబాద్ సభ అనంతరం ఊరు దాటిన అనంతరం వైద్యులు కాలికి చికిత్స చే శారు. ఆ తర్వాత మళ్లీ పాత బూట్లు ధ రించి పాదయాత్రను రేగడి మద్దికుం ట వరకు కొనసాగించారు.