December 24, 2012

ఢిల్లీ వీధి పోరాటాలే పరిష్కారం!



 
మీట నొక్కితే షాక్..మార్కెట్‌కు వెళితే దడ..బస్సు ఎక్కి టికెట్ చూసుకుంటే గుండె గుభేల్..పప్పు నుంచి పెట్రోల్ దాకా ధరలు ఎంత పెరిగిపోయాయి? స్వాతంత్య్రం వచ్చిన త రువాత ఇంతలా నిత్యావసరాలు నిప్పులు కక్కడం ఎప్పుడూ లేదు. సుల్తానాబాద్ వైపు వె ళుతుండగా కొంతమంది కలిశారు. ధరాఘాతానికి కందిపోయిన వాళ్లను చూస్తే బాధనిపిం చింది. ధరల పెరుగుదలపై వారిలో తీవ్రమైన ఆవేదన కనిపించింది.

"ఏం కొనేటట్టు లే దు..ఏం తినేటట్టు లేదు'' అన్న వేదన వారి మాటల్లో వ్యక్తమయింది. ధరల పెరుగుదల విషయంలో హేతుబద్ధత లేకుండా పోయింది. కరెంటు చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్టీసీ చార్జీలు, ఎరువులు, నిత్యావసరాలు..ఇలా ఏది ముట్టుకున్నా మండిపోతున్నాయి. అదీ ఇదీ అని తేడా లేకుండా ఎడాపెడా ధరలు పెంచి పారేశారు. మరీ ఇంత అన్యాయమా?

ఆరోగ్యం కోసం ఆరిపోతున్నవారు ఎందరో..ఒకవైపు ఆస్పత్రి ఖర్చులు, మరోవైపు పిల్లల చదువులు.. పేదలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రైవేట్ ఆస్పత్రులు, స్కూళ్లు తప్ప మరో మార్గం లేని పరిస్థితిని పాలకులు కల్పిస్తున్నారు. ఆ ఖర్చులను భరించడానికి వీళ్లు అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులను మేపేందుకే ఆరోగ్య శ్రీ. పేదలకు ఖరీదైన వైద్యం పేరిట పెద్దోళ్లకు ఖజానాను దోచిపెడుతున్నారు. ఇప్పుడా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు 'ఆరోగ్యశ్రీ'పై నిరా సక్తత చూపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం.

కార్పొరేట్ ఆస్పత్రి మెట్లు ఎక్కేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీని సమర్థంగా అమలుచేయని ప్రభుత్వం.. ఈ పథకాన్నీ ధరవరల్లాగే చుక్కల్లో కలిపే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు విద్యుత్ విషయమై వైఎస్ చేసిన పాపం రూ. 6,500 కోట్ల రూపంలో పేదల నెత్తిన పడింది. వచ్చే ఏడాది కోసం మరో పది వేలకోట్లు సిద్ధం చేసి పెట్టారు. ఈ జనం చెప్పేది వింటుంటే ఢిల్లీ వీధుల్లో కనిపించిన తిరుగుబాటు మనదగ్గరా జరగాలనిపిస్తోంది.