November 22, 2012

మాఫీ చేసి చూపిస్తాం,సాధ్యాసాధ్యాలు మాకు తెలుసు



మాఫీ చేసి చూపిస్తాం
రైతు రుణాలపై చంద్రబాబు
తొలి సంతకం దానిపైనే
అప్పట్లో వైఎస్ వ్యతిరేకించారు
మా పోరాటంతోనే దేశవ్యాప్తంగా అమలు
సాధ్యాసాధ్యాలు మాకు తెలుసు
అన్నీ ఆలోచించాకే హామీలు
తెలంగాణ అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తా
ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రుడే దిక్కు
రాత్రి పూట వెన్నెల వెలుగే శరణ్యం

సంగారెడ్డి, నవంబర్ 22 : 'అధికారంలోకి వస్తాం. రుణమాఫీ చేస్తాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. పెరిగిన పెట్టుబడి వ్యయం, ప్రకృతి కన్నెర్రతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కష్టాల్లో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం రుణ మాఫీ ఫైలుపైనే చేస్తానని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో ఐదో రోజైన గురువారం ఆయన మునిపల్లి, ఝరాసంగం మండలాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "రుణ మాఫీ చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు.

ఒక్కొక్కరికి రూ.5000 ఇస్తే చాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు. మేం చేసిన ఉద్యమాలతోనే కేంద్రం దిగొచ్చింది. రుణమాఫీ ప్రకటించింది. రుణమాఫీకి మేం ఉద్యమాలు చేస్తే.. వైఎస్ వద్దన్నారు. రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించి మాకు స్పష్టంగా అవగాహన ఉంది. అన్నీ ఆలోచించిన తర్వాతే మేం హామీలు ఇస్తాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం'' అని వ్యాఖ్యానించారు.
No comments :

No comments :