November 22, 2012

పార్లమెంట్‌లో తెలంగాణపై బిల్లు ఎందుకు పెట్టలేదు 22.11.2012

పార్లమెంట్‌లో తెలంగాణపై బిల్లు ఎందుకు పెట్టలేదు
కల్లును నిషేధిస్తానని ఎప్పుడూ చెప్పలేదు
గీత కార్మికుల పొట్టకొట్టిన వైఎస్
గీత కార్మికులకు లైసెన్సులు : చంద్రబాబు నాయుడు

మెదక్, నవంబర్ 22 : ఎవరి మద్ధతు లేకుండానే కేంద్రం అణుఒప్పందం బిల్లును ఆమోదించిందని, అలాంటిది అందరూ ఒప్పుకున్నప్పటికీ పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు ఎందుకు పెట్టలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలోని టీడీపీ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర కరెంట్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రారంభించిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర జిల్లాలో 48వ రోజైన గురువారం కొనసాగుతోంది. ఈ ఉద యం మునిపల్లి మండలం అంతారం నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు ఏవీ కొనుక్కునే పరిస్థితి కనిపంచడంలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం గ్యాస్ సబ్సీడీ ఎత్తివేసి మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపిందని ధ్వజమెత్తారు.

పిల్లా కాంగ్రెసుకు చెందిన పత్రికలో గీత కార్మికులను అవమానించేలా రాతలు వచ్చాయని, బెల్టు షాపులను రద్దు చేస్తానని తాను చెప్పానని, కానీ గీత కార్మికులను కూడా ఆ పత్రిక కలిపిందని చంద్రబాబు మండిపడ్డారు. కల్లుకు, బెల్టు షాపులకు సంబంధం లేదన్నారు. కల్లుని నిషేధిస్తానని తాను చెప్పలేదన్నారు. వైయస్ ఉన్నప్పుడు గీత కార్మికుల పొట్ట కొట్టాడన్నారు. అప్పుడు రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు లైసెన్సులు ఇస్తామన్నారు. చంద్రబాబు వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ రోజు మొత్తం 17 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు.
No comments :

No comments :