November 9, 2012

సామాజిక న్యాయం పేరిట పార్టీ పెట్టిన ఒకాయన తనకు న్యాయం జరగ్గానే వెళ్లిపోయాడు...8.11.2012



మొండెద్దును వదిలించుకుందాం: చంద్రబాబు
వ్యవస్థలను పతనం చేసిన వైఎస్
వాటిని భూస్థాపితం చేసిన కిరణ్
సోనియా అప్పుడే మందలిస్తే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదు
రాని కరెంటుకు బిల్లుల మోత
తెలంగాణకు భవిష్యత్తులోనూ అడ్డురాం
 "రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఆరు రెట్లు పెరిగినా, ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ చిన్నభిన్నం చేసింది. తమ సమస్యల గురించి ప్రజలు ఎన్నిసార్లు మొర పెట్టు కున్నా స్పందించడం లేదు. ఇది మొండెద్దు ప్రభుత్వం. దీనిని వదిలిం చుకుందాం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైఎస్ రాజశేఖరరెడ్డి పతనావస్థకు చేరిస్తే.. ఇప్పుడు కిరణ్‌కు మార్‌రెడ్డి వాటిని భూస్థాపితం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ దొంగలు బ్రిటిష్ వాళ్ల కంటే అధ్వానమని, దేశాన్ని, రాష్ట్రాన్ని అందిన కాడికి దోచుకు న్నారని ధ్వజమెత్తారు.

'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా చంద్ర బాబు గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండలోని శేరి వెంకటా పురం, లింగాల చేడ్, సూరారం, మల్లాపూర్ గేట్ ద్వారా రంగారెడ్డి జిల్లా సరి హద్దులోని కొత్లాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాబుకు ఘనమైన వీడ్కోలు పలికా రు. అనంతరం, సాయంత్రం ఐదున్నరకు ఆయన రంగారెడ్డి జిల్లా పగిడి యాలకు చేరుకున్నారు. అక్కడ బాబుకు మంగళ హారతులు, జయ జయ ధ్వానాలతో ఘన స్వాగతం పలికారు.

పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో వివిధ సందర్భాల్లో బాబు మాట్లాడుతూ.. "వైఎస్ అవినీతి చక్రవర్తి. అవినీతి ఎలా చేయాలో నేర్పించారు. ఆయన చనిపోయినా, అవినీతిని నేర్చుకున్న వాళ్లు మాత్రం ఇంకా ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. ఈ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ప్రజలకు అన్నీ సమస్యలే. వాటిని భరించలేక సన్యాసం పుచ్చుకుని అడవులకు వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది. అయినా, అక్కడకూ ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి దోచుకుంటారు'' అని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డిని సోనియా అప్పుడే మందలించి ఉం టే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఆమె కూడా అవి నీతిని ప్రోత్సహించి రాష్ట్రాన్ని అథోగతి పాలు చేశారన్నారు.

గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో దోమలను పెంచి పోషిస్తున్న ప్రభుత్వం, వాటిని ప్రజలకు బహుమానంగా ఇస్తోందని, ఒకవేళ అవి కుట్టవే మోనన్న అనుమానంతో కరెంట్ తీసేసి ఫ్యాన్ కూడా తిరగకుండా చేస్తోందని విమర్శించారు. ఇలాంటి దోమలకు మందు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే, అవినీతి దోమలను నిర్మూ లిద్దామన్నారు. అసలు కరెంటే ఉండడం లేదని, కానీ సర్దుబాటు చార్జీల పేరిట బిల్లుల మోత మోగిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమ పథకాలంటే సీఎం కిరణ్‌కు తెలియదని, తాము ఏదైనా మంచి కార్యక్రమం సూచిస్తే, దానికి ఏదో కిరికిరి పెడతారని విమర్శించారు.

తొమ్మి దేళ్ల కాంగ్రెస్ పాలనలో నెలకొన్న అరాచ కం చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. సామాజిక న్యాయం పేరిట పార్టీ పెట్టిన ఒకాయన తనకు న్యాయం జరగ్గానే వెళ్లిపోయాడని ఎద్దేవా చేశారు. గత తొ మ్మిదేళ్లలో ఏం జరిగిందనే విషయాన్ని ఆ లోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీ డీపీ అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీ ఫైల్‌పైనే పెడతానని, బెల్టు షాపులు తొలగిస్తానని, ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నిస్తానని, ప్రజలకు నిరంతర విద్యుత్‌పాటు వ్యవసాయానికి 9 గంటలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణకు తాము ఏ మాత్రం వ్యతిరేకం కాదని, భవిష్యత్తులోనూ అడ్డురా మని చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే, కొందరు మాత్రం తమనే టార్గెట్ చేస్తున్నారని, తమ సభలకు ఆటంకాలు కల్పించే యత్నం చేస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఇచ్చేదీ తెచ్చేదీ తామేనంటూ చెప్పిన కాం గ్రెస్‌ను వదలి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేయడమేమిటని ప్రశ్నిం చారు. అన్ని చోట్ల బహిరంగ సభలు పెడుతున్న సీఎంను ఏమనకుండా తమనే అడ్డగిస్తున్నారన్నారని పరోక్షంగా టీఆర్ఎస్‌ను విమర్శించారు. జర్నలి స్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని, ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని బాబు ప్రకటించారు. మీడియాలో కూడా ఎంతో మంది పే ద కుటుంబం నుండి వచ్చిన వారున్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు కనీస వేతనం అమలయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.
No comments :

No comments :