June 1, 2013

బైబిల్‌పై ప్రమాణం చేస్తారా?

 తాను టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు కేటీఆర్‌ను కలిసినట్లు బైబిల్‌ ప్రమాణం చేసి చెప్పాలని, లేనిపక్షంలో ఆధారాలుంటే బయటపెట్టాలని తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) అధ్యక్షుడు ఈడిగ ఆంజనేయగౌడ్‌ డిమాండ్‌ చేశారు. గత పదేళ్లలో తానెప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌ను కలువలేదన్నారు. ఇదే విషయాన్ని తాను భగవద్గీత, బైబిల్‌ ప్రమాణం చేస్తానని, భారతికి ఏమాత్రం నిజాయితీ ఉన్న తాను కేటీఆర్‌ను కలిశానని బైబిల్‌పై ప్రమాణం చేసి చెప్పాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌భవన్‌లో ఈడిగ ఆంజనేయగౌడ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసత్య కథనాలతో తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని చూసిన సాక్షి పత్రిక యజమాన్యానికి త్వరలోనే లీగల్‌ నోటిసులు పంపుతానన్నారు. సాక్షి పత్రికను ఎవరు చదవవొద్దని, ఆ ఛానెల్‌ ఎవరు చూడవద్దని ఆయన రాష్ర్ట ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జగన్‌ భజనతో ప్రతినిత్యం తరించే పత్రికను చదివిన, ఛానెల్‌ చూసిన మీ పిల్లలు కూడా తప్పుదారి పట్టే ప్రమాదముందన్నా రు. డబ్బు సంపాదనే లక్ష్యంగా మీ పిల్లలు సైతం వక్రమార్గాన్ని అనుసరించే అవకాశ ముందంటూ హెచ్చరించారు. సాక్షి పత్రికకు విషపు రాతలు రాయడం ఇదేమి కొత్త కాద న్నారు. గతంలో హైకోర్టు న్యాయమూర్తులపైన అసత్య కథనాలు రాసిందని గుర్తు చేశారు. బీసీ విద్యార్థి నాయకుడినైన నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీసేందుకు సాక్షి యజ మాన్యం కుట్ర చేసిందని మండిపడ్డారు. గత కొంతకాలంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిం చడం జరిగిందని, ఇది వారికి ఎంతమాత్రం నచ్చలేదన్నారు. ఇటువంటి కథనాలెన్ని రాసిన బెదిరేది లేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు.

జులై, ఆగస్టు మాసాల్లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ఆంజనేయగౌడ్‌ వివరించారు. రాష్ట్రావ్యాప్తాంగా జగన్‌ అవినీతి, సోనియా, కేసీఆర్‌ కుమ్మక్కు రాజకీయాల గురించి వివరిస్తామన్నారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్‌ ఆడుతున్న రాజకీయ నాటకాలకు తెరదించేవిధంగా విద్యార్థి, యువకులను చైతన్యవంతులను చేసి, సెప్టెంబర్‌ మాసంలో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.