June 3, 2013

మహానాడు తీర్మానాలపై బొత్స అవగాహనలేవి వ్యాఖ్యలు:దేవినేని


 ఇటీవల జరిగిన మహానాడులో టిడిపి చేసిన తీర్మానాలపై పిసిసి చీఫ్‌ బొత్సకు సరైన అవగాహన లేదని, ముందుగా తీర్మానాలను చదివి మాట్లాడాలని టిడిపి జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమా మహేశ్వరరావు సూచించారు. మహా నాడు తీర్మానాలపై ఆయన వ్యాఖ్య లను ఖండిస్తున్నానన్నారు. బందరు రోడ్డులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆది వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొత్స పిసిసి చీఫ్‌గా కాకుండా పదవి ఊడబోతోన్న పిసిసి అధ్యక్షుడి వలే మాటా ్లడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంట రుణాల రద్దుపై తొలి సంతకం చేస్తుందని ఉమా స్పష్టం చేశారు. బెల్టుషాపుల ఎత్తివేత, బిసిలకు వంద సీట్లు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల డిక్లరేసన్లపై ఇచ్చిన హామీలను తమ పార్టీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

కళంకిత మం త్రిగా ఉన్న సారధిని తక్షణమే భర్తరఫ్‌ చేసి సిఎం తన నిజాయితీని నిరూపించు కోవాలని సూచించారు. మంత్రి సారధి ఢిల్లీకి ముడుపులు పంపుతూ తన పద విని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 10న జరిగే అసెంబ్లీ సమా వేశాల్లో సభా కార్యక్రమాల్లో కళంకిత మంత్రులను మాట్లాడనివ్వకుండా అడ్డు కుంటామని ఉమా స్పష్టం చేశారు. లిక్కర్‌కింగ్‌, డాన్‌గా పేరోందిన బొత్సకు తమ పార్టీ అధినేతను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. సెంట్రల్‌ నియోజక వర్గం ఇన్‌చార్జి బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగ రానికి ఎంపి రాజగోపాల్‌ ఒక విజిటింగ్‌ ప్రొఫెసర్‌లా తయారయ్యారని విమ ర్శించారు. నగరానికి చెందిన ముగ్గురు ఎంఎల్‌ఏలు నగరాన్ని అభివృద్ధి చేయ లేని చేతగానివాళ్లల్లా తయారయ్యారని, వీళ్లా తమ పార్టీని విమర్శించేది అని ఎద్దేవా చేశారు. పదవి ఉన్న నాలుగు రోజులు ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. తమ పార్టీని, నేతలను విమర్శిస్తే కార్యకర్తలు చూస్తూ ఊరు కోరని హెచ్చరించారు.