June 3, 2013

రేపు టీడీపీ కీలక భేటీ

రానున్న ఎన్నికల్లో గెలుపే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఆ దిశలో బుధవారం ఒక కీలక సమావేశం నిర్వహణకు సిద్ధపడుతోంది.

గత సార్వత్రిక ఎన్నికలలో పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేసిన అభ్యర్థులతో పాటు సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలతో అధినేత చంద్రబాబు నాయుడు నివాస గృహంలో ఒక సమావేశం నిర్వహించ నున్నారు. ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశాలున్నందున శ్రేణులను అప్రమత్తం చేసే దిశలో ఇది తొలి అడుగు అని ఆ పార్టీ వర్గాలు వివరించాయి. ఈసారి తూ తూ మంత్రంగా కాకుండా స్పష్టంగా నేతలకు కొన్ని మార్గదర్శకాలను అధినేత జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. తమ తమ ప్రాంతాల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం చేసే కృషిని పార్టీ పరిగణలోకి తీసుకుం టుందన్న విషయాన్ని నేతలకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వివరించ నున్నారు. అనుకూల ఫలితాలను సాధించడంలో విఫలమయ్యే నేతలకు రానున్న అసెంబ్లిd, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌లు నిరాకరించేందుకూ వెనుకాడబోమన్న సందేశాన్ని బలంగానే అందించేందుకు అధినేత నిర్ణయానికి వచ్చారు. వివిధ నియోజకవర్గాల్లో అనుకూల ప్రతికూల అంశాలను నేతల నుంచి చంద్రబాబు రాబట్టనున్నారు. ఇంఛార్జీలు లేని ప్రాంతాల్లో సమీక్షలు పూర్తి చేసి వీలైనంత త్వరగా వారి నియామకాలను చేపడతారు. ఏ క్షణం స్థానిక ఎన్నికలు ముంచుకొచ్చినా వాటిని ఎదుర్కునేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.