April 6, 2013

ఫ్లెక్సీల్లో ఫోటోలపై జూ.ఎన్టీఆరే ఖండించాలి : బాలకృష్ణ

విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు
అధికారంలో కాంగ్రెస్ - అంధకారంలో ఆంధ్రప్రదేశ్


విజయవాడ ఎన్టీఆర్ ఫోటోలతో ఓట్లు వస్తాయని, వైఎస్ ఫోటోతో ఓట్లు రావని గుర్తించినందుకే అందుకే ఎన్టీఆర్ ఫోటో వాడుకుంటున్నారని వైసీపీ నేతలను బాలకృష్ణ పరోక్షంగా విమర్శించారు. వచ్చే ఎన్నికలలో ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించ లేదని, చంద్రబాబుతోను, పార్టీలోనూ చర్చించాకే అంతిమ నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు బాలకృష్ణ తెలిపారు.

కృష్ణా జిల్లా ఫ్లెక్సీల వివాదంపై బాలయ్య మాట్లాడుతూ ఫ్లెక్సీల్లోని ఫోటోలపై జూనియర్ ఎన్టీఆరే ఖండించాలని, దీనిపై త్వరలో జూ.ఎన్టీఆర్‌తో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఖండించని పక్షంలో ఎలంటి పరిణామాలనైనా ఎదుర్కోవాలన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారన్నారు.

జయప్రద రోజుకో పార్టీ పేరు చెబుతున్నారని, ఏమైనా సమస్యలుంటే తనను సంప్రదిస్తే పార్టీ దృష్టికి తీసుకెళ్లే వాణ్ణికదా అని బాలకృష్ణ పేర్కొన్నారు. కొడాలి నాని పార్టీ నుంచి వెళ్లిపోయినా నష్టంలేదన్నారు. టీడీపీ గుర్తుతోనే నాని గెలిచినట్లు ఆయన గుర్తుచేశారు. టికెట్ల విషయంలో జోక్యం చేసుకోనని, పార్టీ కోసం కష్టపడే వారికి తెలుగు దేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బాలకృష్ణ తెలిపారు.
: విద్యుత్ కోతలు, అధిక చార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రముఖ నటుడు బాలకృష్ణ ఆందోళన వ్యక్తపరిచారు.. శనివారం ఉదయం కృష్ణా జిల్లా కొమరవోలులో పర్యటించిన బాలయ్య టీడీపీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనకు, కాంగ్రెస్ పాలనకు పోలీకేలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో కరువు ఉన్నా రైతులు, గృహాలకు నాణ్యమైన విద్యుత్ అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని ఆయన ఆవేదనగా అన్నారు. అధికారంలో కాంగ్రెస్ - అంధకారంలో ఆంధ్రపదేశ్ అని బాలయ్య రాష్ట్ర ప్రభుత్వానికి చురక అంటించారు.