April 1, 2013

విద్యుత్ చార్జీలు పెంపు బాధాకరం : చంద్రబాబు

తూ.గో  ఇది గుడ్డి ప్రభుత్వమని, రాష్ట్రాన్ని చీకటి రాజ్యంగా చేసిందని ఆరోపించారు. టీడీపీ హాయంలో నాలుగేళ్లు కరువు ఉన్నా రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చామని గుర్తు చేశారు. సీఎం కిరణ్‌కు విద్యుత్‌పై అవగాహన లేదన్నారు. కరెంట్‌ను ముందే కొని వుంటే ఇబ్బందులు వచ్చేవి కాదని ఆయన తెలిపారు.

కరెంట్ కొనుగోలు, బొగ్గు దిగుమతుల్లో సీఎం కిరణ్ అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డబ్బు తీసుకుని ప్రైవేటు కంపెనీలకు అనుమతులు ఇచ్చారని, ఆ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు కరెంట్‌ను అమ్ముకుంటున్నారని, ఇందులో మనకు మిగిలింది మాత్రం కాలుష్యం, బూడిదే అని విమర్శించారు.

యూనిట్‌కు రూ.12 చెప్పున కరెంట్ కొంటున్నామని సీఎం కిరణ్ చెబుతున్నారు...అందులో ఆయన వాటా ఎంత అని ప్రశ్నించారు. సమర్థవంతమైన విద్యుత్ వ్యవస్థను అప్పగిస్తే వైఎస్ నుంచి కిరణ్ వరకు నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తపరిచారు. విద్యుత్ రంగాన్ని రూ.40 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టారన్నారు. కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు పనికిరాని వాళ్లని వ్యాఖ్యానించారు.

కిరణ్‌కు ధైర్యం ఉంటే 1994 నుంచి 2013 వరకు విద్యుత్‌పై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎరవు ఏం చేశారో తెలుస్తుందన్నారు. తాము విడుదల చేసిన బ్లాక్‌పేపర్‌పై కట్టుబడి ఉన్నట్లు బాబు తెలిపారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల చిన్న పరివ్రమలను కోలుకోలేని దెబ్బతీశారని చంద్రబాబునాయుడు మండిపడ్డారు.

చంద్రబాబు చేపట్టిన ఒక్కరోజు దీక్షకు భారీగా కార్యకర్తలు, స్థానికులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
: విద్యుత్ చార్జీల పెంపు బాధాకరమని, ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని కాంగ్రెస్‌పై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. సోమవారం ఉదయం విద్యుత్ సమస్యలకు నిరసనగా కాకినాడలోని నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్ద బాబు ఒక్క రోజు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టించిందని దుయ్యబట్టారు.