March 31, 2013

రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకోసం ఆశపడి వెళ్లిన వారికి బుద్ధి చెప్పాలి.........

తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించి ప్రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకు ఆశపడి పిల్ల కాంగ్రెస్‌లో చేరిన నేతలకు బుద్ధి చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలకు పిలపునిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడలో శనివారం పెద్దాపురం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముప్పయ్యేళ్లు పార్టీలో ఉండి పదవులు అనుభవించి విలువల్లేకుండా జైలుకెళ్లి మరీ పిల్ల కాంగ్రెస్‌లో చేరారని బొడ్డు భాస్కరరామారావుపై దుమ్మెత్తిపోశారు. నీతి, నియమాలు లేని నాయకులు ఎక్కడా రాణించలేరన్నారు.

ప్రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకోసం ఆశపడి వెళ్లిన వారికి బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు వెళ్లిపోతున్నా కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా అండదండలు అందించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. 'ఆ నేత చెంచలగూడ జైలుకెళ్లి కొబ్బరికాయ కొట్టి జైలు పార్టీలో చేరాకా.. మీ అందరికీ స్వేచ్ఛ వచ్చినట్లు కన్పిస్తున్నారు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చి ఉత్సాహంగా ఉన్నారు' అని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

టీడీపీని వదిలి బయటకు వెళ్లిన వాళ్లెవరైనా రాణించారా? తమ్ముళ్లూ? అన్న చంద్రబాబు ప్రశ్నకు.. లేదు.. లేదు.. వీళ్లకూ జైలే గతి.. అని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎండుకొమ్మల్ని తీసేస్తేనే కొత్త చిగుళ్లు వస్తాయని ఒక కార్యకర్త చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఔను తమ్ముడూ.. ఎండుకొమ్మల్ని మనం తీయకుండానే పోతున్నాయి. కలుపుమొక్కల్ని పీకిపడేస్తేనే పంట బాగా పండుతుంది.. అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.వీళ్లంతా టీడీపీలో ఉంటేనే హీరోలు.. బయటకు పోతే జీరోలే. మీరంతా పార్టీ వెంటే ఉన్నారు. ఇపుడు ఆ నాయకులకు తమ వెంట వస్తారన్న భ్రమలు కూడా తొలగిపోయాయి.. అని చంద్రబాబు బొడ్డును ఉద్దేశించి ఆక్షేపించారు.

పెద్దాపురం నియోజకవర్గం చరిత్ర సృష్టించాలి వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరైనా అఖండ మెజార్టీతో గెలిపించి కా ర్యకర్తలు చరిత్ర సృష్టించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఇపుడే ఎన్నికలు వచ్చినట్లు కన్పిస్తోంది.. అన్నారు.

వెకిలి చేష్టలు ఎందుకు?

పిల్ల కాంగ్రెస్‌లో చేరిన ఆ నేత నేను పాదయాత్ర చేస్తున్న దారిలో ఉగాది శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఉగాది ఎప్పుడు తమ్ముళ్లూ? తొందరపడి ముందే కూసింది ఓ కోడి.. అన్నట్లు తయారయ్యారు ఈ నేత. మ న కార్యకర్తల్ని తన వెంట జైలు పార్టీలోకి రమ్మంటున్నా వెళ్లడంలేదని దౌర్జన్యాలు చేస్తున్నారట.. అని చంద్రబా బు అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయాలని చూసినా బెదిరించినా ఖబడ్తార్.. అని హెచ్చరించారు.

ఐదు వందల అనపర్తి ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగకుండా నీతి, ని జాయితీలతో కూడిన టీడీపీని గెలిపించాలన్నారు. ఏదైనా పని కోసం వెళ్తే అ నపర్తి ఎమ్మెల్యే డబ్బిచ్చి ఓట్లేయించుకున్నానని పని ఎలా చేస్తానని చెప్తున్నార ట. ప్రలోభాలకు లొంగితే అలాగే ఉం టుంది.. ఈ కాంగ్రెస్ వాళ్లు దోచుకోవ డం మళ్లీ ఆ సొమ్ముతో ప్రలోభాలకు గురిచేయడం వైఎస్ నుంచి నేర్చుకున్నారు.. అని అనపర్తి ఎమ్మెల్యేని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనపర్తి నియోజకవర్గంలో పాదయా త్ర ప్రారంభమైనప్పటి నుంచీ చాలా సభల్లో చంద్రబాబు ఈ ఐదు వందల విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.

కార్యకర్తల సూచనలు విన్న బాబు శనివారం జరిగిన పెద్దాపురం ని యోజకవర్గ సమీక్షలో చంద్రబాబు కా ర్యకర్తల ప్రసంగాలను ఆసక్తిగా విన్నా రు. పలువురు కార్యకర్తలు చేసిన సూచనలను బాబు రాసుకున్నారు. జట్ల మో హన్ అనే కార్యర్త మాట్లాడుతూ.. 1995లో మీరు సీఎంగా ఉన్నపుడు పు ట్టిన పిల్లలకు ఇపుడు ఓటు హక్కు వచ్చింది. వాళ్లలో చాలామందికి మీ పాలన గురించి, పరిపాలనా దక్షత గురించి తెలియదు. డాక్యుమెంటరీలు రూపొందించి అలాంటివారికి అవగాహన కల్పించాలి.. అని చంద్రబాబుకు సూచించారు. ఆర్‌బీ పట్నానికి చెందిన చిన్న, రవికుమార్ (వేట్లపాలెం), గోలి సత్తిరాజు (సామర్లకోట), నున్న రాంబాబు, సిద్ధా త్రిమూర్తులు, జిలా నీ, రెడ్డి లక్ష్మి పెద్దాపురం ఇన్‌ఛార్జిగా సమర్ధుడైన నేతను ఎంపిక చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.