January 20, 2013

అడుగడుగునా.. ఆత్మీయ పలకరింపు

వస్తున్నా... మీకోసం పాదయాత్రకు నియోజకవర్గంలో ఆదివా రం నాలుగో రోజు జనం నీరాజనం పలికారు. మధ్యాహ్నం బస ప్రాంతం నుంచి 2.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 2కి.మీ.లు సాగి గుడిబండ గ్రామానికి చేరుకుంది. మార్గమధ్యలో కూరగాయల వ్యాపారులు, ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులతో ఆయన మాట్లాడి వారి యోగక్షేమాల ను తెలుసుకుని కొంత ఆర్థికసహాయం చేశారు. గుడిబండ గ్రామశివారులో వృద్ధులను పలకరించారు. వారికి పింఛన్లు వస్తున్నాయా.. లేదా అని తెలుసుకొని ఒకరికే వస్తుందని చెప్పడంతో తమ ప్రభుత్వం వస్తే ఇద్దరికీ అందజేస్తామని బాబు హామీ ఇచ్చారు.

అనంతరం గుడిబండ గ్రామ సెంటర్‌లో రోడ్డుపై ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించి అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరుగుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ చింతన్‌బేటక్‌లో వారసత్వ పదవులు కట్టబెట్టేందుకే పరిమితమైందని ఆరోపించారు. గ్రామంలోని పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కేంద్రంలోకి వెళ్లిన బా బు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం ఉండాలని ఆశీస్సులు అందించి ముద్దాడి ముందుకు సాగారు. గ్రామం లో మసీదు వద్ద ముస్లింలు యాత్రకు ఎదురెళ్లి టోపీ పెట్టి స్వాగతం పలుకారు.

సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగిన బాబు వికలాంగులు, వృద్ధులను పలకరించా రు. వారికి ప్రభుత్వం నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఏ మేరకు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు యాత్రకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం సాగిన పాదయాత్ర ముదిగొండ దళితవాడకు చేరుకుంది. అక్కడ రోడ్లు, ఇళ్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సోమపంగు కనకరత్నం ఇంట్లో మంచంపై కూర్చు ని వారితో ముచ్చటించారు. దళితవాడ నుంచి తిరిగి కాపుగల్లు రోడ్డుకు చేరుకున్న పాదయాత్రకు గ్రామానికి 3 కి.మీ.ల ముందే గ్రామస్థులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నా యకులు డప్పు వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలతో యాత్రకు స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతలు సీఎం రమేష్, యర్రబెల్లి దయాకర్‌రావు, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డి, సీతక్క, సునీత, లతో పాటు జిల్లా నాయకులు కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, రజనీకుమారి, కిరణ్మయి, బండ్రు శోభారాణి, లింగయ్యయాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, పార సీతయ్య, అజయ్‌కుమార్, ఓరుగంటి ప్రభాకర్, ఓరుగంటి బ్రహ్మం తదితరులు వెంట సాగారు.

అనంతరం గ్రామంలో చంద్రబాబు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన సుజల స్రవంతి మంచినీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామసెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన బాబు అవినీతిపై మాట్లాడాలని కొంతమంది ప్రజలకు మైకు ఇచ్చి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని, అవినీతిపరులకు శిక్షలేకుండా పోయిందని అన్నా రు.

మీ ప్రభుత్వ కాలంలో అవినీతి పరులను దండించారని, ఒకే ఒక్కడు సినిమాను ఆదర్శంగా తీసుకుని వచ్చేఎన్నికల్లో అధికారం చేపట్టి అవినీతిపరుల భరతం పట్టాలని ప్రజలు కోరారు. దీనిపై స్పందించిన బాబు ఒకేఒక్కడు దర్శకుడు శంకర్ మనల్ని ఆదర్శంగా తీసుకుని సినిమా తీశారని, ఆయనే తనతో స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే అవినీతిని అంతమొందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు .

'మాదిగల అభివృద్ధికి కృషి' రాష్ట్రంలో మాదిగలు ఇంకా దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మాదిగల అభి వృద్ధికి కృషి చేస్తానన్నారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం కోదాడ మండలంలోని గుడిబండ శివారులో ఉన్న దళితవాడకు చేరుకున్నారు. అక్కడ దళిత మహిళలతో ముచ్చటించారు. మీకు ఆదాయం ఏవిధంగా వస్తుంది? గేదెలు ఉన్నాయి, వాటి ద్వా రా ఆదాయం వస్తుందా? పొలం ఉం దా..? అని ప్రశ్నించారు. పొలం లేదని మహిళ సమాధానం చెప్పడంతో గడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు.

కొనుగోలు చేస్తామని, రోజు కూ లీతో వచ్చే ఆదాయంతో తమ కుటుంబాలను వెల్లదీసుకుంటున్నామని అ న్నారు. ఇళ్లు లేక ఒక్కొక్క ఇంట్లో నాలుగు జంటలు సహజీవనం చేయాల్సి వస్తుందని సమస్యలను దళిత కాలనీ మాజీ ఎంపీటీసీ బాబుకు వివరించింది. అంతేకాకుండా కాలనీలోని సమస్యలను బాబు దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో విషసర్పాల కాటుకు మృత్యువాత పడాల్సి వస్తుందని ఏకరువు పెట్టారు. దీనిపై స్పందించిన బాబు మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతికి ఏబీసీడీ వర్గీకరణ అవసరమని, వర్గీకరణకు తను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఏబీసీడీ వర్గీకరణకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని అన్నారు

. మాదిగల అభ్యున్నతికి ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి ఎకరం పొలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను కూలికి పంపకుండా చదివించాలని, తమ ప్రభుత్వం వస్తే మాదిగ పిల్లలకు ఉచితవిద్యతో పాటు చదువుకున్న యువతకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇంటి ఆవరణలో ఉన్న సీమచింతకాయ (గుబ్బ) చెట్లను చూసి దీని కాయలు మీరు తింటారా.. లేక పశువులకు వేస్తారా అంటూ హాస్యోక్తంగా ప్రశ్నించారు. దీంతో తాము తింటామని, ఆకులను గొర్రెలకు, మేకలకు ఉపయోగిస్తామని సమాధానం ఇవ్వడంతో బాబు అక్కడి నుంచి నిష్క్రమించి తిరిగి పాదయాత్రకు ఉపక్రమించారు.

'మూతపడిన పరిశ్రమలు' కోదాడరూరల్: రాష్ట్రంలో విద్యుత్ కోతల వలన పంటలు ఎండిపోయి రైతులు, పరిశ్రమలు సైతం మూతపడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రెడ్లకుంట గ్రామంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 40వేల పరిశ్రమలు ఉండగా విద్యుత్ కోత కారణంగా 10వేలకు పైగా మూతపడ్డాయని అన్నారు. రెడ్లకుంట ప్రాంతంలో అనేక చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయని అవికూడా విద్యుత్ కోతతో నడపలేక మూసివేశారన్నారు.

దీంతో కార్మికులు పనికోసం వలస వెళ్తున్నారని అన్నారు. రెడ్లకుంట గ్రామానికి పాలేరు జలాలు టీడీపీ హయాంలో తీసుకువచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్‌రావుతో పాటు పార్టీ మండలాధ్యక్షుడు మల్లెల ఆదినారాయణ, నాయకులు మల్లెల పుల్లయ్య, మల్లెల బ్రహ్మయ్య, భాస్కర్‌రావు, వెంకన్నగౌడ్ పాల్గొన్నారు.