December 31, 2012

నేనూ రైతు బిడ్డనే..: బాబు



 మాజీ ముఖ్యమంత్రి, టీడీ పీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేను రైతు బిడ్డనే అంటూ రైతులను, కూలీలను ఆత్మీయంగా ప లకరించారు.వారి సమస్యలు తెలుసుకుంటూ ముం దుకు సాగారు. సోమవారం మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామ శివారులోని బస ప్రాంగణం నుం చి పాదయాత్ర ప్రారంభించిన ఆయన రంగాపురం గ్రామ సమీపంలో పత్తి, మిరప చేన్లలోకి వెళ్లా రు. రైతులను కలిశారు. పంటల దిగుబడిపై అడిగి తెలుసుకున్నారు.

రంగాపురం గ్రామానికి చెందిన రైతు వర్దెల్లి దే వేందర్‌రావు, బలుగూరి రాజేశ్వర్ రావు, సంపత్‌రావు, కిషన్‌రావులు బాబుతో మాట్లాడారు. గిట్టుబా టు ధర లేకపోవ డంతో పెట్టుబడులు పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని వివరించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్‌ను భూస్థాపి తం చేయాలని బాబు పేర్కొన్నారు.

బలుగూరి రాజేశ్వర్‌రావు సాగు చేసిన మిర్చి పం ట తెగుళ్ల బారిన పడగా బాబు పరిశీలించారు. దేవేందర్‌రావు చేనులో ఏర్పాటు చేసిన డ్రిప్‌ను చూసి , ఇది అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నాబార్డు నిధులతో రూ.2500 కోట్లతో రా ష్ట్ర వ్యాప్తంగా డ్రిప్‌లు అందించామని గుర్తు చేశా రు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల ను అభినందించారు. డీబీఎం-31 ఎస్సారెస్పీ కాలు వ ద్వారా పంటలకు చుక్క నీరు రావడం లేదని రై తులు బాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మా ట్లాడి నీళ్లు అందేలా చూస్తానని బాబు హామీ ఇచ్చారు.

కూలీల మొర..: రంగాపురం గ్రామ శివారులో పంట చేలల్లో పని చేస్తున్న కూలీలు రోడ్డుపైకి వచ్చి బాబుతో సమస్యలపై మొరపెట్టుకున్నారు. పూట గడవటం లేదని, ఉపాధి పథకంలో పని చేసిన డబ్బులు సమయానికి రావడం లేదని వాపోయారు. పింఛన్‌లు, ఇందిరమ్మ గృహాలు, మరుగుదొడ్లు అందించడం లేదని ఏకరువు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగిన కూలీ రేట్లు పెరగడం లేదని, ప్రభుత్వం నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో విఫలమైందని బాబు పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని, ధరలు తగ్గిస్తామని బాబు వారికి హామీ ఇచ్చి పాదయాత్రలో ముందుకు సాగారు.