December 31, 2012

రైతుల బతుకు ఆగం




ఎటు చూసినా దీన గాధలే.. అన్నదాతల ఆక్రందనలే.. గుండెలను పిండేసే దయనీయ దృశ్యాలే. కరెంట్‌లేక ఎండిపోతున్న పొలాలు. పనులు లేక వలస పోతున్నకూలీలు.. చంద్రబాబు పాదయాత్రలో అడుగడుగునా వినిపించిన కన్నీటి గాధలు.. సోమవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'వస్తు న్నా... మీ కోసం' పాదయాత్రలో ఎదురుపడ్డ ప్రతీ రైతు తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీ టి పర్యంతమయ్యాడు. ప్రతీ మహిళా ఇబ్బందులను వివరిస్తూ సాయం కోసం ఆర్థించింది. యాత్రలో చంద్రబాబు రైతుల సమస్యలను మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చే శారు. దారి పక్కన ఉన్న మిర్చి, పత్తి చేనుల్లోకి దిగారు. పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారికి ఏం కావాలో తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితికి పాలకుల అలస త్వం, అసమర్ధత ఎంత మేరకు కారణమో విడమరిచి చెప్పారు. తమ ప్రభుత్వ హ యాంలో చేసింది వివరించారు. రెండింటిని బేరీజు వేసుకొనే దిశగా గ్రామీణుల ఆలోచన లు మళ్లించారు.

మిర్చి పంట పోయింది: రంగాపురంలో మోత్కూరు రాజయ్య మి ర్చి పంటను బాబు చూశారు. పంట పూర్తిగా దెబ్బతిన్నది. కరెంట్‌లే కొంత, తెగులు సోకి మరికొంత. ఎకరాకు రూ 30వేలకు పైగా పెట్టుబడిపెట్టానని, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రాజయ్య వాపోయాడు. ఆర్థికంగా చితికిపోయిన తనను ఆదుకోవలసిందిగా అభ్యర్థించాడు. గ్రామంలో అంతటా ఇదే పరిస్థితి.

పొట్టకూటి కోసం వలస: ఇదే గ్రామంలో కొందరు వ్యవసాయ మహిళా కూలీలను చంద్రబాబు కలిశారు. పరకాలకు చెందిన వీరి బీడీలు చేసే వారు, ఆ పని దొరక్క పనుల కోసం మిర్చి ఏరేందుకు వ చ్చినట్టు వెల్లడించారు. రోజుకు వంద రూపాయలు కూలీ వస్తున్నా, స్థానిక కూలీలు త మను అడ్డుకుంటుండడంతో ఈ మాత్రం పని కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదని వ లుగూరు మంజుల, కిట్టి స్వరూప, ఆలేటి భారతి బాబుకు మొరపెట్టుకున్నారు. ఉపాధి హామీ పథం కింద కూడా పనులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.

ట్రిప్ అయిన డ్రిప్ సేద్యం: బిందు సేద్యంలో రంగాపురం ఒకప్పుడు ఆదర్శ గ్రామం. ఇక్కడ దాదాపు 10వేలకు ఎక రాలకు పైగా భూమి బిందు సేద్యం కిందనే సాగవుతోంది. మిర్చి, పత్తి పంటలను దీని కిం దనే పండిస్తున్నారు. ఆయా రైతులు బాబుకు తమ కష్టాలను వివరించారు. టీడీపీ హయాం లో బాబు బిందు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇజ్రాయిల్‌లో ఈ సేద్యం గు రించి అధ్యయనం చేసి మరీ అమలు చేశారు. దీంతో ఆయన సేద్యం తీరును లోతుగా అడి గి తెలుసుకున్నారు. స్ప్రింక్లర్లు, పైపులు పూర్తి గా దెబ్బతిన్నాయనీ, మూడేళ్లకు ఒకసారి ప్ర భుత్వమే మార్చాలని, ఐదేళ్లయినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

వికలాంగులతో భేటీ: మార్గ మధ్యలో వికలాంగులతో బాబు కొద్దిసేపు మాట్లాడారు. వారికి వికలాంగుల పింఛన్ వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నా రు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితికి చేరిన శ్రీరాం రవి తన బాధలను వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వ స్తే నెలకు రూ.1500లు ఇస్తానని బాబు హా మీ ఇచ్చారు. మూగవాడైన తన కొడుక్కి ఫిం చన్ ఇవ్వడం లేదని, కలెక్టర్ కార్యాలయం చు ట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుం డా పోయిందని శ్రీరాం లక్ష్మి వాపోయింది.

లక్ష్మిపురంలో టీఆర్ఎస్ ధ్వజం: రంగాపురంలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్‌పై విమర్శనాస్త్రాలను సంధించారు. 'తెలంగాణపై టీడీపీ సా నుకూలంగా ఉండడంతో టీఆర్ఎస్ బెంబేలెత్తిపోతోంది. పునాదులు కదిలిపోతాయని భయ పడుతోంది. అందుకే లేనిపోని విమర్శలు చే స్తోంది' అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పనితీరును విమర్శిస్తూ రైతుల కరెంట్ బాధలను తొలగించే విషయంలో పూర్తిగా చే తులెత్తేసాడన్నారు. కరెంట్ సమస్యను సమీక్షించేందుకు విద్యుత్ శాఖకు మంత్రే లేకపోవడాన్ని ఎత్తిచూపారు.

గండ్రపై పరోక్ష విమర్శలు: ప్రభుత్వ చీఫ్ విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై పరోక్షంగా ఆరోపణాస్త్రాలను సంధించారు.'అధికారాన్ని అ డ్డంపెట్టుకొని ప్రజల సొమ్మును దోచుకు తిం టున్నారు. మాఫియాలుగా తయారయ్యారు. వారికి సంపాదనే లక్ష్యం. ఇసుక, బొగ్గు ఇలా అన్ని కాంట్రాక్టులు వారికే కావాలి. పెంట్రోల్ బంకులూ వారికే ఉండాలి. చివరికి భార్యాభర్త లు మధ్య పంచాయతీవస్తే... ఆ సెటిల్‌మెం ట్లు వారే చేస్తారు. దేన్నీ వదిలిపెట్టరు । అం టూ ధ్వజమెత్తారు. స్థానిక సమస్యలపై మా ట్లాడుతూ పరకాలలో చలివాగు ప్రాజెక్టు నిర్మాణానికి కలెక్టర్‌కు లేఖ రాస్తానని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెల ల్లో పనులు ప్రారంభిస్తామని వాగ్దానం చేశా రు. రంగాపురం గ్రామ సమస్యలు పరిష్కారిస్తానని చెప్పారు. విద్యార్థులకు సైకిళ్ళతో పా టు లాప్‌టాప్‌లను కూడా ఇస్తామన్నారు.

మహిళల జై తెలంగాణ: పరకాల మండలం లక్ష్మిపురంలో కొందరు మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు రంగాపురంలో బహిరం గ సభలో మాట్లాడిన తర్వాత లక్ష్మిపురం చేరుకున్నారు. గ్రామంలో చేనేత కార్మికుల మొగ్గాలను పరిశీలించారు. పెరుగ సంఘం వారిని కలుసుకున్నారు. వారితో మాట్లాడుతుండగా బయట రోడ్డు ప్రక్కన కొందరు మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం మొ దలు పెట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి దూరం గా తీసుకుపోయారు. ఆ తర్వాత బాబు అక్క డి నుంచి పాదయాత్రగా నాగారం చేరుకున్నా రు. మధ్యాహ్నం భోజనం అక్కడే చేశారు.

మూడో రోజు: ఉదయం 10.52 గంటలకు బాబు పాదయాత్రను మొదలు పెట్టారు. మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట నుంచి రంగాపురం, పరకాల మండలంలోని లక్ష్మిపురం, నాగా రం, పరకాల మీదుగా కామారెడ్డి క్రాస్ రోడ్డు వరకు సాగింది.రాత్రి బాబు ఇక్కడే బస చేశారు.