December 31, 2012

వైఎస్ఆర్ పాలనలో రౌడీ సంస్కృతి



 
వైఎస్ఆర్ హయాంలో రౌడీ సంస్కృతి పెరిగిపోయిందని, కడ ప, పులివెందులలో ఎలా హత్యలు చే స్తారో.. వరంగల్ జిల్లాలోనూ అలా త యారు చేశారని ఆరోపించారు. అలాం టి వారితోనే పరకాలలో అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. జిల్లాలో రౌడీలు లేరని, అయితే వైఎస్సార్ పరిపాలన చేపట్టగానే రౌడీలు పెరిగిపోయారని, మాఫియాలు పెరిగాయని, భూ కబ్జాలు, దోపిడీలు పెరిగాయని ఆ రోపించారు. లా అండ్ ఆర్డర్ అదుపు లో లేకుండా పోయిందన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండలం రంగాపు రం, పరకాల మండలం నాగారం, పరకాల పట్టణాల్లో జరిగిన బహిరంగ సభ ల్లో చంద్రబాబు ప్రసంగించారు.

రాష్ట్ర్టాన్ని దోపిడి చేసిన వైఎస్: వైఎస్సార్ పాలనలో రాష్ట్రం దోపిడీ కి గురైంది.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను నేను కాపలా ఉం టే.. వైఎస్సార్ అమ్ముకున్నాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నెలకొల్పి సైబరాబాద్ నిర్మాణం చేపట్టానని, నిజాం భూములను కాపాడానని, ఆ భూములకు అప్పట్లో ఎకరా కు ఒకటి రెండు లక్షల రూపాయలు ఉంటే 2004లో ఎకరాకు రూ.30 కోట్లు పెంచి కంపెనీలకు దారాదత్తం చేశారన్నారు. 130 లక్షల ఎకరాల భూముల ను దారాదత్తం చేశారని ఆరోపించారు. వైఎస్సార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన కుమారుడు లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 1.56 లక్షల ఎకరాల బయ్యారం భూములను అల్లుడికి వైఎస్సార్ ధారాదత్తం చేశారని, ఖమ్మం గనులను అప్పగించారని ఆరోపించారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో రౌడీలు, మాఫియాలు రాజ్యమేలారని విమర్శించారు.

రైతులు కుదేలు: కరెంట్ కష్టాలతో రైతులు కుదేలవుతున్నారని, పంట దిగుబడి లేక, పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర లేక అవస్థ లు పడుతున్నారని పేర్కొన్నారు. రైతు ల కష్టాలను తీర్చేందుకు రుణమాఫీ చే స్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి ఉపాధి హామీని అనుసంధా నం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశం నుంచి డ్రిప్ ఇరిగేషన్‌ను రాష్ట్రానికి తెచ్చింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అయితే రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన పైపులను ఐదేళ్లకొకసారి సబ్సిడీతో అందిస్తామని హామీ ఇచ్చారు.

నిరుద్యోగులకు ఉపాధి: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతానని, నిరుద్యోగ భృ తి అందిస్తానని పేర్కొన్నారు. బీఈడీ చేసిన విద్యా ర్థులకు ఎస్‌జీటీలో అవకా శం కల్పిస్తానని పేర్కొన్నారు. ఈ ఏడా ది కరెంట్ బిల్లులు రెండు బల్బులు ఉం టే రూ.5వేల నుంచి రూ.10వేలు వ సూలు చేస్తున్నారని, ఈ ఏడాది సర్ చార్జీ పేరిట మరో రూ.10వేల కోట్లు విధించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు 29సార్లు పెంచి పేదల నడ్డి విరిచారన్నారు. మహిళల్లో పొదుపు ఉద్యమం చేపట్టేందుకు డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించానని, అయితే పావులావడ్డీ అని చెప్పి వడ్డీకివడ్డీలు కట్టించుకుంటు అసలు మాత్రం తీరడం లేదని పేర్కొన్నారు.

మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులకు ఉరి శిక్ష వేస్తే సమాజం హర్షించేదన్నారు.

ఉనికి ఉండదనే...L తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో తమ ఉనికి గల్లంతు అవుతుందని టీఆర్ఎస్ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. తెలంగాణకు టీడీపీ అడ్డు కాద ని చెప్పిన సిగ్గులేకుండా పాదయాత్ర ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నార ని మండిపడ్డారు. 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్‌కు 50 సీట్లు కేటాయిస్తే 10 సీట్లే గెలిచిందని, మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే భయంతో ఈ ఆరోపణలకు ది గుతుందని విమర్శించారు. అసమర్థ ముఖ్యమంత్రి వల్లనే నిత్యావసరాల ధరలు పెరిగిపోతు న్నాయని, ఉప్పు, పప్పు, వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వాపో యారు. వేటిపై న అవగాహన లేని ముఖ్యమంత్రి అన్నీ తెలిసినట్లు వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

ఆ ఒక్క రోజు..: ఎన్నికల ఒక్కరోజును నాకివ్వండి.. ఐదేళ్లు మీ సేవకుడిగా సేవ చేస్తా.. నా కు ఏ కోరిక లేదు.. మీరు క్షేమంగా ఉం డాలని పాదయాత్ర చేస్తున్నా. మీ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకే వస్తున్న మీకోసం కార్యక్రమం చేపట్టా. మీ సమస్యలను పరిష్కరిస్తా. మీకు అండగా ఉంటా.. మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటా అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు నే ను హైదరాబాద్‌లో ఉంటే సబబు కాద నే మీ వద్దకు వస్తున్నా నని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ గుం డు సుధారాణి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.