November 19, 2012

ఇంద్రకరణ్ స్కూలుకు రూ.2 లక్షలిప్పిస్తానని హామీ

టీచర్ బాబు!
ఇంద్రకరణ్ స్కూలుకు రూ.2 లక్షలిప్పిస్తానని హామీ

సంగారెడ్డి, నవంబర్ 19 : ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడే చంద్రబాబు సోమవారం స్కూలు టీచర్ పాత్ర పోషించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఇంద్రకరణ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి 45 నిమిషాల పాటు విద్యార్థులతో గడిపారు. 'టీచర్లున్నారా? వస్తున్నారా? పుస్తకాలున్నాయా?' అని ఆరా తీశారు. టీచర్‌గా మారి విద్యార్థులకు హితబోధ చేశారు. మహాత్మాగాంధీ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారని, కష్టపడి చదువుకున్నారని చెప్పారు.

అంబేద్కర్ తన తల్లిదండ్రులకు 14వ సంతానమని, పేదరికంలో ఉండి కూడా బాగా చదువుకుని రాజ్యాంగాన్ని రాశారని చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కష్టపడి, చదువుకుని రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ కూడా బాగా చదువుకొని పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డారన్నారు. పాఠశాలలో తాగునీటి వసతి కల్పించేందుకు ఎంపీ నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
No comments :

No comments :