October 2, 2013

TDP గూటికి భూమా దంపతులు ?


జగన్ వ్యవహరణ తీరు, జరుగుతున్న పరిణామాలు, వస్తున్న పుకార్లు దీనికి ఆధారాలు అని విశ్లేషకులు అంటున్నారు. నిప్పులేనిదే పొగ రాదు..అన్నట్టుగా భూమా ఫ్యామిలీలో అసంతృప్తి లేనిదే ఈ పుకార్లు మొదలవ్వవు.
ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంతో.. ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న భూమానాగిరెడ్డి ఆశలకు అడ్డుకట్ట పడింది. గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యమున్న నాగిరెడ్డి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచే అయితే సులభంగా గెలవొచ్చని ఆశించాడు. అయితే ఇప్పుడు ఆయనను నంద్యాల అసెంబ్లీకి ఇన్ చార్జ్ గా ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ! మరి ఎంపీగా పోటీ చేయాలనుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేయడం కచ్చితంగా ఆయనలో అసంతృప్తిని రగిల్చే విషయమే!
అదిగాక.. వైకాపాలో ఉన్నందున మొత్తం కర్నూలు జిల్లాపైనే ఆధిపత్యాన్ని కోరుకొంది భూమా ఫ్యామిలీ. దీనికి జగన్ సమ్మతించడు. ఎవరికీ సోలోగా ఒక జిల్లా బాధ్యతలను అప్పజెప్పడానికి జగన్ సిద్ధంగా లేడు. దీంతో భూమా ఫ్యామిలీకి అన్ని విధాలుగానే నిరాశే కలుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో.. ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. జరిగిన పరిణామాలు.. ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. దీంతో భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు వైకాపాకు విడ్కోలు చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయం కలుగుతోంది.