October 2, 2013

ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?

ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మరోసారి జాతీయ రాజకీయాలలో ప్రధాన భూమిక ను పోషించే రోజులు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చక్రం తిప్పబోయేది ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక ప్రాంతంలో తెరాస, మరో ప్రాంతంలో వైసీపీలతో అవగాహన కుదుర్చుకుని కాంగ్రెస్ తన మ్యాజిక్ ఫిగర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు అమలుచేస్తుండగా... దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి నాందీ పలుకుతోంది. గత నెలలో న్యూఢిల్లీ పర్యటనలోనే ఎన్డీయేలో చేరికపై బాబు సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలుస్తున్నది.

మంగళవారం హైదరాబాద్‌లో ముస్లింనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమై భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిక అంశంపై అభిప్రాయాలు తెలుసుకున్న పరిణామం కీలకమైన ముందడుగుగా పేర్కొన వచ్చు. చంద్రబాబు బుధవారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా భాజపాతో ముందుకెళ్ళే అంశంపై చర్చ నడుస్తోంది. గతంలో ఎన్డీయేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు కలిసొచ్చిన సెంటిమెంట్, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువతరం, విద్యావంతుల్లో పెరిగిన ఆదరణ, యూపీయేకి పరిస్థితులు రోజురోజకు దిగజారిపోతుండటం ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై ఎన్డీయేలో చేరడం ఒక్కటే రాజకీయంగా ఉత్తమమైన మార్గమని, అది రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిది ఖాయమని దాదాపు తేలిపోయింది. అందులో చంద్రబాబు నిర్వహించాల్సిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్వీనర్ బాధ్యతలను అప్పగించే విషయంలో భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సుముఖంగానే వున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. అయితే ఏపీలో పార్టీ బలాబలాలు, సమీకరణలు ఎప్పుడు ఎలా మారిపోతాయో, టిడిపి, వైసీపీలలో ఏ పార్టీ ముందుంటుందో, ఎక్కువ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్న మోడీ ఒకవైపు బాబు పాత్రకు ఒకే చెబుతూనే మరోవైపు వైసీపీ అంశానికి కూడా తలుపులు మూసివేయడం లేదని తెలుస్తోంది. గతంలో యుఎఫ్ కన్వీనర్‌గా దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్ సర్కార్ల హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు అనుభవాల దృష్ట్యా ఎన్డీయే కన్వీనర్ పదవిని అప్పగించేందుకు ముందుకొస్తోంది. 

తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం టిడిపి అధినేత గతంలోలాగ కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, గతంలో ఎన్టీఆర్ తరహాలో యూపీయేను గద్దెదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ మరోసారి జాతీయ రాజకీయాలలో ప్రధాన భూమిక ను పోషించే రోజులు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చక్రం తిప్పబోయేది ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక ప్రాంతంలో తెరాస, మరో ప్రాంతంలో వైసీపీలతో అవగాహన కుదుర్చుకుని కాంగ్రెస్ తన మ్యాజిక్ ఫిగర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు అమలుచేస్తుండగా... దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి నాందీ పలుకుతోంది. గత నెలలో న్యూఢిల్లీ పర్యటనలోనే ఎన్డీయేలో చేరికపై బాబు సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలుస్తున్నది.