September 23, 2013

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితితోను, సీమంధ్రలో జగన్ పార్టీతోను పొత్తు పెటుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావాలన్న ఉద్దేశం

  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్ బెయిల్ ఉహించిందేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి వ్యాఖ్యానించారు. సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఆమె మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్ పిల్లకాంగ్రెస్ నేత జగన్‌కు బెయిల్ ఇప్పస్తుందని తమకు ముందే తెలుసన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను బాధ్యతలనుంచి ఇందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారన్నారు.


తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితితోను, సీమంధ్రలో జగన్ పార్టీతోను పొత్తు పెటుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ఇందులో భాగంగానే జగన్‌కు కోర్టులో బెయిల్ వచ్చేవిదంగా సిీబీఐని పావులా వాడుకున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర 53రోజులుగా రగిలిపోతుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చోద్యం చుస్త్తున్నారన్నారు. జగన్‌కు బెయిల్ ఇప్పించడంలో వున్న శ్రద్ధ తెలుగు వారిని ఐక్యంగా ఉంచడంలో చూపించడం లేదన్నారు.