September 17, 2013

ఏ-9గా మంత్రి గీతారెడ్డి.......!!!

జగన్ అక్రమాస్తుల కేసులో
మరో రెండు చార్జీషీట్లు దాఖలు
ఏ-9గా మంత్రి గీతారెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మరో రెండు చార్జీషీట్లును మంగళవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో సీబీఐ అధికారులు దాఖలు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఇందూ సంస్థపై చార్జీషీట్లు దాఖలు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ చార్జీషీట్‌లో మొత్తం 14 మందిని నిందుతులుగా పేర్కొంది. మంత్రి గీతారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన పేర్లను అధికారులు చేర్చారు. 2004-09లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి గీతారెడ్డిని ఏ-9గా, దర్మాన ప్రసాదరావు ఏ-11గా సీబీఐ పేర్కొంది. జగన్ ఏ-1, విజయసాయి ఏ-2, శ్యామ్ ప్రసాద్ ఏ-3, బీపీ ఆచార్య ఏ-4, ప్రభాకర్‌రెడ్డి ఏ-5, ఇంకా జగతి పబ్లికేషన్‌కు సంబంధించిన వారిని నిందితులుగా సీబీఐ పేర్కొంది.
జగన్ కంపెనీల్లో ఇందూ గ్రూప్ రూ. 70 కోట్లును పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ విచారణలో తేల్చింది. ఇందుకు ప్రతిఫలంగా 8848 ఎకరాల భూమిని అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించింది. అలాగే శంషాబాద్‌లో ఇందూ టెక్ జోన్‌కు 250 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రాజెక్టులు నిర్మించి యువతకు వేల ఉద్యోగాలను కల్పిస్తామని ఈ సంస్థ పేర్కొంది. అయితే భూమిని తనఖా పెట్టి తీసుకున్న కోట్ల రూపాయలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సిబీఐ చార్జీషీట్‌లో పేర్కొంది. ఇందూ ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ మంత్రి సబితా రెడ్డిని ఏ-8గా సీబీఐ చార్జీషీట్‌లో పేర్కొంది.

లేపాక్షి నాలెడ్జ్‌హబ్‌ చార్జ్‌షీట్‌లో...
14 మందిని నిందితులుగా చేర్చిన సీబీఐ
ఏ-1 జగన్‌, ఏ-2 విజయసాయిరెడ్డి, ఏ3 శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి...
ఏ-6 లేపాక్షి చైర్మన్‌ బాలాజి, ఏ-7 బీపీ ఆచార్య...
ఏ-8 శ్యామ్‌సన్‌రాజు, ఏ-9 గీతారెడ్డి, ఏ-10 శ్యామ్యూల్‌...
ఏ11 ధర్మాన, ఏ-12 మురళీధర్‌రెడ్డి
ఏ13 ప్రభాకర్‌రెడ్డి, ఏ14 జగతి పబ్లికేషన్స్‌

ఇందూ ప్రాజెక్ట్‌ వ్యవహారంలో...
10 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ
ఏ-1 జగన్‌, ఏ2, విజయసాయి, ఏ3 శ్యామ్‌ ప్రసాద్‌..
ఏ4 ఇందూ ప్రాజెక్ట్, ఏ5 ఇందూటెక్‌, ఏ6 ఎస్పీఆర్‌ ప్రాజెక్ట్‌..
ఏ-7 రత్నప్రభ, ఏ8 సబిత, ఏ-9 బీపీ ఆచార్య