June 19, 2013

కోటి సంతకాలతో టీడీపీ హల్‌చల్

హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను అసెంబ్లీకి తీసుకువచ్చి టీడీపీ హల్‌చల్ చేసింది. మంగళవారం టీడీపీ ఎమ్మెల్యేలు సంతకాలున్న డబ్బాలతో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. కోటి సంతకాలతో కూడిన వినతిపవూతాన్ని గవర్నర్ పంపించాలని పట్టుబట్టారు. సంతకాల డబ్బాలను సభలోకి తీసుకురావడం సరైంది కాదని, కేవలం వినతిపవూతమే సమర్పించాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్షికమార్క కోరినా వినిపించుకోలేదు. దీంతో స్పెషల్ మెన్షన్ కింద వినతిపవూతాలను సమర్పించేందుకు సభ్యులకు డిప్యూటీ స్పీకర్ అవకాశమిచ్చారు. అంతకుముందు విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు గన్‌పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. కరెంటు కోతలు, ధరల పెంపుదలకు నిరసనగా జిల్లాల వారిగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను ప్రదర్శించారు. అనంతరం వాటిని ఎమ్మెల్యేలు నెత్తిన ఎత్తుకుని తీసుకొచ్చి అసెంబ్లీలో స్పీకర్‌కు అందజేశారు. లోక్‌సత్తా పార్టీ ఎమ్మెల్యే జయవూపకాశ్ టీడీపీ ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలిపారు.