June 23, 2013

మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వండి : బాబు

చార్‌థామ్‌ యాత్రకు వెళ్లి వదరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని టీడీపీ చీఫ్‌చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అమెరికా నుంచి ఆదివారం ఆయన తిరిగొచ్చారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. యాత్రికులను ఢిల్లీ నుంచి స్వస్థలాలకు తరలించేందుకు చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఉన్న వరదబాధితులను ఆయన పరామర్శించనున్నారు. చార్‌థామ్‌యాత్రకు 12 వేల మంది వెళ్లి ఉంటారని అంచనా అని, రాష్ట్ర వాసులు వందల్లో గల్లంతైనట్టు సమాచారం అందుతోందని ఆయనచప్పారు. ఇప్పటివరకు అధికారికంగా ఎంతమంది మృతి చెందారో తెలియడం లేదని చెప్పారు. జాతీయ విపత్తు వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వాసులు 5వేల మంది చిక్కుకున్నారంటే, రెవెన్యూ మంత్రి ఇక్కడి నుంచి కదల్లేదని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తరాఖండ్‌లో రక్షించిన వారిని స్వస్థలాలకు విమానాల్లో తరలివచ్చు కదా ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న రాష్ట్ర బాధితుల సమస్యలపై ప్రధానికి లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు.