March 5, 2013

జిల్లా టీడీపీని గాడిలో పెడతా

జిల్లా టీడీపీ పరిస్థితులపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, పార్టీకి నష్టం చేకూర్చే వ్యవహారాలు అరికడతానని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పామర్రు మండలం కురుమద్దాలిలో 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర బసలో సోమవారం ఆయన పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పార్టీకి కార్యకర్తలు బలం, శక్తి అని 1983లో అనేక మంది కార్యకర్తలనే ఎన్టీఆర్ గెలిపించి చట్ట సభల్లో కూర్చోపెట్టారన్నారు. టీడీపీలో కుదుపులు కొత్త కాదని, ఒక పర్యాయం ఏడుగురు ఎంపీలు వెళ్ళిపోయినా పార్టీ చెక్కు చెదరలేదన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా కార్యకర్తల అండతో పార్టీ పటిష్ఠంగా ఉంటోందన్నారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కార్యకర్తలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారని చెప్పారు.

ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. జిల్లా నాయకత్వం ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదని కొం దరు కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇకపై జిల్లా, మండల, గ్రామస్థాయి పార్టీ సమావేశాలు పారదర్శకంగా సాగేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పీఎసీఎస్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయాలకు కారణాలను అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. జిల్లాలో సమన్వయం లోపం వల్ల కేడీసీసీ బ్యాంక్ చేజారిందని కార్యకర్తలకు సర్దిచెప్పారు. పట్టభద్రుల నియోజకవర్గం విషయంలో పార్టీ నాయకులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోవడమే ఓటమికి కారణమని పేర్కొన్నారు.

అయితే అభ్యర్థి చిగురుపాటి వరప్రసాద్ వ్యక్తిగత వైఫల్యమే కారణమని కార్యకర్తలు సమాధానమిచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలు కొరవడి అమ్ముడుపోయే వ్యక్తులను పార్టీలో ఉంచరాదని కార్యకర్తలు పేర్కొనగా, అందరూ శాఖాహారులే, గంపలో రొయ్యలు మాయం అన్న చందంగా రాజకీయాల్లో విపరీత పోకడలు పెచ్చుమీరాయన్నారు. మంచివాడు అనుకుని ప్రోత్సహిస్తే బుద్ధి చెడి అనైతికతకు పాల్పడుతున్నారన్నారు. ఎంపీ కొనకళ్లకు చంద్రబాబు ప్రశంస మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు అందుబాటులో లేరని ఒక కార్యకర్త ఫిర్యాదు చేయగా అనవసరమైన విషయాల జోలికి వెళ్ళవద్దని వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వవద్దని చెబుతూ కొనకళ్ల పనితీరును చంద్రబాబు ప్రశంసించారు.

జిల్లా నేతలకు క్లాస్ జిల్లాలో కార్యకర్తలను నడిపించే నా యకులే కరువయ్యారని దీంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యా దు చేశారు. దీనిపై చంద్రబాబు నాకు అందరి విషయాలు తెలుసు, ఆవలిస్తే పేగులు లెక్కిస్తానని, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలని అనే విషయమై దృష్టి పెట్టాలని హితవు పలికారు. జనాలు కాంగ్రెస్‌కు శాపనార్థా లు పెడుతున్నారని, బూతులు తిడుతున్నారని, కనిపిస్తేనే వారి చొక్కాలు చించడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జిల్లా నాయకత్వం గ్రా మ, మండల, నియోజకవర్గ స్థాయి సదస్సులు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేయాలని ఉద్బోధించారు.