March 5, 2013

చేతులు మారింది రూ.2000 కోట్లు

రైతు రుణ మాఫీలో భారీ కుంభకోణం
రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు
ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: నామా

రైతులకు రుణాలు మాఫీ చేయడానికి ఉద్దేశించిన ప్రజా ధనంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని కాగ్ అక్షింతలు వేసింది. రైతు రుణ మాఫీలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని కాగ్ ఆరోపించింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం 11 వేల కోట్ల రూపాయల మేర రుణ మాఫీకి కేటాయించారు. ఇందులో కనీసం రెండువేల కోట్ల రూపాయలు చేతులు మారాయని కాగ్ నిర్ధారణకు వచ్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను కాగ్ ప్రభుత్వానికి అందజేసింది.

ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాగ్ నిర్ధారించినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ విషయమై వివ రణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎం.పి. నామా డిమాండ్ చేశారు.