March 14, 2013

అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీస్తాం

కలెక్టరేట్ : బాబ్లీ ప్రాజెక్టు విషయం లో నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ సర్కారును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీ డీపీ ఎమ్మెల్యేలందరం కలిసి నిలదీస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్‌రావు అన్నారు. బా బ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో రివ్యూ పి టిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ మం గళవారం టీడీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా ని ర్వహించారు. మండవ మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టు పనులు జరుగుతుంటే మన రాష్ట్రానికి చెందిన ఓ పశువులు కా సే రైతు చూసి మన రాష్ట్రానికి అన్యా యం జరుగుతోందని కలిగిన ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కలుగలేదన్నారు. ఈ దారుణానికి దివంగత ము ఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డే కారణమన్నారు. నీళ్ల కోసం కొట్లాడే ధైర్యం లే కనే కాంగ్రెస్ మహారాష్ట్ర ప్రభుత్వానికి తలవంచిందన్నారు. 2.74 టీఎంసీల నీ రును వాడుకునే ఉద్దేశం మహారాష్ట్ర ప్ర భుత్వానికి లేదని, మొత్తం నీరును దో చుకుంటుందని, అక్రమంగా నిర్మిస్తున్న 12 ప్రాజెక్టులతో రాబోయే టీఎంసీల నీ టిని వాడుకుంటారని ఇది వాస్తవమన్నారు.

ఒక పక్క కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షు డు బొత్స సత్యనారాయణ బాబ్లీతో రా ష్ట్రానికి అన్యాయం జరిగిందని నేరుగా ఆవేదన వ్యక్తం చేస్తే మీకేమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కళ్లు తె రిచి బాబ్లీ నష్టాన్ని నివారించే వరకు టీ డీపీ పోరాడుతుందన్నారు. శివరాత్రి రో జు కూడా కరెంట్, నీరు లేక దారుణ ప రిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మా ట్లాడుతూ బాబ్లీ విషయంలో బలమైన న్యాయవాదిని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోలేదన్నారు. ప్రభుత్వ వైఖరితో రైతుల నోట్లో మట్టి కొట్టిందని, తెలంగాణకు తీ రని అన్యాయం జరిగిందన్నారు. ఆరు నెలల తర్వాత వచ్చే ఎన్నికల్లో టీడీపీ అ ధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చే శారు. ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, వీ జీగౌడ్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి సీఎం అండగా ఉన్నాడని, ఈ నిర్వాకం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దా పురించిందన్నారు.

తెలంగాణ విషయ లో కేసీఆర్, ఎంపీ మధుయాష్కీ, మ త్రి సుదర్శన్‌రెడ్డి జరుగుతున్న అన్యాయాన్ని ఉద్యమ సమయంలో వెల్లడించారన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం కా రణంగా జిల్లాలో అన్ని వ్యవసాయ భూముల పంటలు బీడు భూములుగా మారనున్నాయన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోతుందని, బాబ్లీ లాంటి అక్రమ ప్రాజెక్టులను కూల్చివేస్తే కానీ తె లంగాణకు నీరు రాదన్నారు. కార్యక్రమ ంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మదన్‌మోహన్‌రావు, దినేష్‌కుమార్, అమర్‌నాథ్‌బాబు, మోహన్‌రెడ్డి, సునీత దేశాయి, బద్యానాయక్, విజయ్‌కుమార్, రామాగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి నరేందర్‌గౌడ్, అంబదాస్‌రావు పాల్గొన్నారు.