December 21, 2012

అన్నదాతలకు అండగా నిలుస్తాం.....

రైతుల కష్టాలు.. కన్నీళ్లు చూస్తున్నా ను.. వారిని చూస్తే గుండె తరుక్కు పో తున్నది. ఆరుగాలం శ్రమించి చెమటో డ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధ ర లేదు.. రైతు కష్టం దళారులు, వ్యాపారుల పాలవుతున్నది.. సాగుకు కరెంట్ లేక.. పంటలు ఎండి పోయి నష్ట పోతున్నారు.. రాత్రి కరెంట్‌తో విద్యుత్తు షాక్ కు గురై రైతులు మృత్యువాత పడుతున్నారు.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొ ద్దు నిద్దరపోతున్నది, కాంగ్రెస్ దొంగలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ప్రజల కష్టాలు పట్టడంలేదు..అధికారం లోకి వచ్చిన వెంటనే పంటరుణాల మా ఫీపై తొలి సంతకం చేస్తానని, గిట్టుబా టు ధరలు కల్పిస్తానని, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరా చేస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని జగిత్యాల మండలం రాజారం నుంచి బయలు దేరిన చంద్రబాబు మల్యాల మండలం నూకపల్లి క్రాస్ రోడ్, మల్యాల క్రాస్ రోడ్, గ్రామ పంచాయతీ, తాటిపల్లి, గంగాధర మం డలం ర్యాలపల్లి గ్రామ శివారు వరకు 15.9 కిలోమీటర్ల దూరంలో పాదయా త్ర సాగింది. ఆయనకు పార్టీ కార్యకర్త లు, ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ యన మార్గమధ్యంలో గీత కార్మికులు, బీఇడీ విద్యార్థులు, కూరగాయలు విక్రయించే మహిళలు, ఇటుక బట్టీల్లో పని చేసే కూలీల కష్టాలు తెలుసుకున్నారు. వరద కాలువను పరిశీలించారు. పెట్రో ల్ బంక్‌లో పెట్రోల్ పోసి పెట్రోల్, డీ జిల్ ధరలు ఎలా ఉన్నాయంటూ ఓ వా హనదారుడిని ప్రశ్నించారు.

ధరలు చా లా పెరిగి పోయాయని భారంగా మా రాయని చెప్పారు. ఇప్పటివరకు ఈ ప్ర భుత్వం 24 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని బాబు అన్నారు. కొద్ది దూరంవచ్చాక తడాకా హన్మంతు యా దవ్ బాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఎ న్టీఆర్ ప్రభుత్వం చేపట్టాక మా యాద వ సంఘానికి గొర్రెలు మేపడానికి 12 ఎకరాల భూమిని ఇచ్చారని ఇప్పుడు దానిని తీసుకునే పరిస్థితి ఉందన్నారు. ఆ భూమిని కాపాడాలని కోరారు. అం దుకు బాబు మాట్లాడుతూ ప్రతి గ్రా మంలో గొర్రెలను మేపుకునేందుకు భూమి కేటాయిస్తానని, ఇదివరకే కేటాయించిన భూమిని తిరిగి ఇప్పిస్తానని తెలిపారు. అనంతరం వరి పంటను పరిశీలించి అక్కడున్న ఓ బైకుపై తీరిగ్గా కూర్చోని ముత్యంపేట రైతులు బద్దం రాంరెడ్డి, మార్పు రాజిరెడ్డిలతో ముచ్చడించారు. వ్యవసాయం ఎలా ఉందని అడిగారు.

స్పందించిన రాంరెడ్డి 7 గం టలు ఇస్తామన్న కరెంట్ ఇవ్వకపోవడం తో పంటలు ఎండిపోయాయని, మద్ద తు ధరలు దక్కడం లేదన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రాజకీయ చైత న్యం తెచ్చారని కరెంట్ చార్జీలు మాఫీ చేసి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రా మరాజ్యం తెచ్చాడని, ఆ తర్వాత మీ పాలన కూడా బాగుందన్నారు. మళ్లీ రా మరాజ్యం రావాలని ఆశించారు. మీరు ఆ ధైర్యపడవద్దు.. మీరు కోరుకుంటున్న పాలనను అందిస్తాను. పంట రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని, గిట్టుబాటు ధరలు కల్పించి, 9 గంటల కరెంట్ ఇస్తానని చెప్పారు. కొద్ది దూరం వెళ్లాక కాటిపెల్లి రాధ అనే మహిళా రై తు బాబు దగ్గరికి రాగానే కన్నీళ్ల పర్యంతమయ్యింది.

రెండేళ్ల క్రితం తన భర్త తి రుపతిరెడ్డి తెల్లవారుజాము చీకట్లో బా వివద్ద కరెంట్ పెట్టబోయి షాక్ కొట్టి చ నిపోయాడని, తనకు ఇద్దరు ఆడపిల్లల ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని చె ప్పింది. ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేక మనకు ఇబ్బందులు వచ్చాయని, మేం అధికారంలోకి రాగానే మీకు ఆ కష్టాలు ఉండవని మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారు. ఇలా.. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ కళాశాలలో కంపౌండ్ వాల్ నిర్మించాలని, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని బాబుకు వినతిపత్రం ఇచ్చి కోరారు. మల్యాలలో ఆయా కులవృత్తుల వారిని పరామర్శిం చి, బీడీల కార్ఖానను సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెయ్యికి 150 రూపాయలు, నెలకు 1500 పెన్షన్ కోసం పోరాటం చేస్తానని వారికి హామీ లు ఇచ్చారు. పవర్‌లూం యూనిట్‌ను పరిశీలించారు. సబ్సిడీపై నూలు ఇచ్చి, కరెంట్ సబ్సిడీని పెంచి న్యాయం చే యాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో గిట్టుబాటు కావడంలేదని కొప్పుల పుష్పనా థం అనే చేనేత కార్మికుడు వాపోయా రు.

అనంతరం మల్యాల, తాటిపల్లిలో జరిగిన సభల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను నమ్మవద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో కలిసే పార్టీ అన్నారు. ఈ పార్టీలకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ పా ర్టీలు తల్లి, పిల్ల పార్టీలని ఎద్దేవా చేశా రు. 'కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ వై.. అభివృద్ధికి నై.. అవినీతికి సై..' అని చమత్కరించారు. అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే జగన్ వైఎస్ఆర్ పార్టీని పె ట్టారన్నారు. ఆయనపై పెట్టిన కేసులను ఎత్తివేస్తే ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతారన్నారు. బీడీ కట్టలపై పుర్రె, శవం గుర్తు పాపం కేసీఆర్‌దేనన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని కేసీఆర్ 6 నెల లు ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడిలా ని ద్రించి ఆ తర్వాత లేచి మాయమాటలు చెబుతారని ఆయన మాటలను నమ్మవద్దన్నారు.

ఆనాడు వరద కాలువ నిర్మాణానికి కిలోమీటర్ కోటి రూపాయలతో అంచనాలు తయారుచేస్తే, కాంగ్రెస్ ప్ర భుత్వం కిలోమీటర్‌కు 7,8 కోట్ల రూపాయలతో అంచనాలు వేసి దోచుకున్నదన్నారు. మల్యాల వద్ద కాలువను లోతు చేయడం వల్ల చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడిందని ఈ సమస్యలను వెం టనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆ యన డిమాండ్ చేశారు. బాధితులు, బీ డీ కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆ దుకునేందుకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ యన వెంట తెలంగాణ టీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, ఎల్ రమణ, మాఐ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, తెలుగు మ హిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి, రాష్ట్ర పరిశీలకులు ఎ విద్యాసాగర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు గండ్ర నళిని, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణరావు, పి రవీందర్‌రావు, తెలు గు రైతు జిల్లా అధ్యక్షులు వెల్ముల రాంరె డ్డి, అధికార ప్రతినిధులు అయిల్నేని సా గర్‌రావు, దామెర సత్యం,సత్యనారాయ ణరెడ్డి, చల్లోజు రాజు,బీసీ సెల్ జిల్లా అ ధ్యక్షులు లక్ష్మినారాయణ, కార్యదర్శి ల క్ష్మణ్‌గౌడ్, అంజలీగౌడ్, నాయకులు వ కుళాభరణం శ్రీనివాస్, రాంలింగారెడ్డి, మ్యాక లక్ష్మన్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సుద్దాల వెంకట గౌతంకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ రెండు జిల్లాల కన్వీనర్ బుర్ర సంజయ్ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌కు లేఖలు..

మల్యాల మండలం రాజారం, గొల్లపల్లి, రామన్నపేటలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని వరద కాలువ నీటిని పోతారం చెరువులో నింపేందు కు లింక్ ఏర్పాటు చేయాలని మల్యాల, రామన్నపేటల చెరువులకు కూడా లిం కు ఏర్పాటు చేయాలని చంద్రబాబు క లెక్టర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.తాటి పల్లి ఏపీ బాలికల గురుకుల పాఠశాల లో 5నుంచి 10వ తరగతి వరకే ఉందని దీనిని ఇంటర్మీడియెట్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని మరో లేఖ రాశారు.

ర్యాలపల్లిలో బస..

జగిత్యాల : టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడు బుధవారం రాత్రి గంగాధర మండలం ర్యాలపల్లిలో బస చేశా రు. బుధవారం ఉదయం 11.35 నిమిషాలకు పాదయాత్ర నూకపెల్లి సమీపం లో చంద్రబాబు పాదయాత్ర మొదలు కాగా.. నూకపెల్లి ఎక్స్ రోడ్, మల్యాల ఎక్స్‌రోడ్, మల్యాల బ్లాక్‌చౌరస్తా, గ్రామ పంచాయతీ మీదుగా వ్యవసాయ మా ర్కెట్ నుంచి తాటిపెల్లి వరకు సాగింది. అటు నుంచి గంగాధర మండలంలోకి ప్రవేశించి ర్యాలపల్లి వరకు15.8 కి.మీ. సాగింది. రాత్రి 11.15 గంటలకు ర్యాలపల్లి శివారు ప్రాంతంలోకి బాబు చేరుకుని అక్కడే బస చేశారు.