December 21, 2012

ఎట్ల బతకాలో..చెప్పు బాబూ..!

ఏమ్మా అంతా బాగేనా? అని చంద్రబాబు పలకరింపు..మహిళ: ఏం బాగున్నాం. పిల్లకు మొన్ననే లగ్గం చేసిన. 4 లచ్చల కట్నం ఇయ్యాలే. పంటచ్చినంక కట్నం పైసలిత్తనని జెప్పి బువ్వ, బట్టలు పెట్టి లగ్గం చేసిన. కరంటు లేక పంట ఎండిపోయింది. పైసలియ్యందే పిల్లను మా ఇం టి తోలడట. ఎగబెడితే లంగ, దొంగ అంటరు. నా కష్టం.. నా నష్టం ఎవలు సూత్తన్నరూ.. నువ్వయితే అచ్చినవు.. కరంట్ బిల్లులయితే బాగా అత్తన్నయి.. ఒక్క రోజు ఆగితే ఫైన్ ఏస్తండ్రు. క రంటు లేదు, నీళ్లు లేవు.. మాకు అన్నం పెడతవో, మన్నే పెడతవో.. అందరం బతకాలి అని బూర్గుపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఈరవేని వెంకవ్వ తన పొలం వద్దకు వచ్చిన చంద్రబాబు తో వాపోయింది.

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా గురువారం జిల్లాలోని గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామ శివారు నుంచి లింగంపల్లి, బూర్గుపల్లి, రామడుగు మండలం తిరుమలాపూర్, మర్రి గడ్డ, సర్వారెడ్డిపల్లి, పెండలోనిపల్లి, గో పాల్‌రావు పేట, గుండి, రాంచంద్రాపూ ర్ గ్రామాల మీదుగా 14.9 కిలోమీట ర్లు పాదయాత్ర సాగింది. 12 గంటలకు బయలు దేరిన ఆయన మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో వి కలాంగులు బేలుపు మల్లేశం, జల్ల పోశన్నలకు ట్రైసైకిళ్లు ఇస్తానని ఇచ్చిన హా మీ మేరకు వారిని పిలిపించి ట్రై సైకిళ్ల ను పంపిణీ చేశారు.

ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వేస్తుండగా మా నాన్న చనిపోయాడని రెండేళ్లయినా ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదని మ మ్మల్ని పరిహారం ఇప్పించాలని ర్యాలపల్లికి చెందిన వేమల నిర్మల, పత్తికి మ ద్దతు ధర ఇవ్వడం లేదని, వరద కా లువ లోతు చేయడం వల్ల భూగర్భ జ లాలు ఎండి పోతున్నాయని, అక్కడక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టి 5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని రైతు కె శ్రీపతిరావు. లింగంపల్లిలో గ్రామ పంచాయ తీ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని యంగ్ స్టార్ యూత్ క్లబ్ సభ్యులు. భర్త మృతి చెంది నాలుగు సంవత్సరాలయ్యింది. వితంతు పెన్షన్ ఇస్తలేరు. అంత్యోదయ కార్డు ఇస్తలేరని వెంగమనేని శ్రీలత. గోర్లను మేపడానికి గడ్డి లే దు. మేపుకునేందుకు ఐదెకరాల భూమి ఇయ్యాలే. అని గొర్రె కాపరులు పోచ య్య, గంగయ్య. మాకు చెట్లు పెంచుకునేందుకు జాగ లేదు. పెన్షన్లు ఇవ్వాలని, చెట్టు మీద నుం చి పడిపోయి చనిపోతే పరిహారం ఇవ్వడం లేదు.

మీరైనా ఇ ప్పించాలని బూర్గుపల్లి గీత కార్మికులు..ఇలా ఆయా వర్గాల ప్రజలు దారి పొ డవునా చంద్రబాబు నాయుడుకు బాధలు విన్నివించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో 8 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్ల బడ్జెట్ ఉందని, కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయడం లేదని విమర్శించారు. స్వర్గీయ ఎన్‌టీ రామారావు సింగిల్ విండో వ్యవస్థను తీసుకు వచ్చారని గుర్తు చేశారు. మండలాలు ఏర్పాటు చేశారని, ప్రజల వద్దకు పాలని నిర్వహించారని ఆ తర్వాత జన్మభూమి నిర్వహించి అన్ని సమస్యలు ప రిష్కరించామన్నారు. సాగునీటి సం ఘాలను పెట్టి సాగునీటి రంగాన్ని ప టిష్టం చేశామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు చేయించామన్నారు. వ్యవసాయానికి 9 గంటల పా టు విద్యుత్తు ఇచ్చామని గుర్తు చేశారు.

ఈ ప్రభుత్వం 4 గంటలు కూడా కరెం ట్ ఇవ్వకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారని అన్నారు. ఈ సీజన్ కు కరెంట్ ఇవ్వలేమని చేతులెత్తేశారని, ఎస్సారెస్పీ నీటిని కూడా ఇవ్వడం లేద ని మండిపడ్డారు. కరెంట్ బిల్లులు చూ స్తుంటే గుండె గుభేలు మంటున్నాయ ని చార్జీల మీద చార్జీలు పెంచి, సర్‌చార్జీ లు వేసి బాదుతున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇదేమి పరిపాలన అని ప్రశ్నించారు. వ్య వస్థలన్నీ కుప్ప కూలిపోయాయని, వీఇఓలను తొలగించిన వైఎస్ఆర్, 50 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలను, బెల్టు షాపుల నిర్వాహకులను ఆదర్శ రైతులుగా పెట్టారని వారి వల్ల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందడం లేదన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తానని, రైతుల రుణాలు మా ఫీ చేస్తానన్నారు. బీసీల కోసం 10 వేల కోట్లతో సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేసి కులవృత్తులకు ఆదరణ కల్పిస్తామన్నారు.

మైనార్టీలకు విద్య, ఉద్యోగాల పరంగా 8 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అ సెంబ్లీ ఎన్నికల్లో 100 మందికి టిక్కెట్లు ఇస్తానని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హా మీ ఇచ్చారు. గొర్రె కాపరులకు 5 ఎకరా ల భూమిని కేటాయించి, మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. గీత కా ర్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇ స్తామని, చెట్టుపై నుంచి పడి మృతి చెం దే వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని హామీ ఇచ్చారు. చేనే త, కుమ్మరి, కమ్మరి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానని, ఎస్సీ వర్గీకరణ చేపడతానని చెప్పారు. బాగా చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఇస్తామన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, మీ కష్టాలు తీరతాయని, అందరినీ ఆదుకుంటానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆ యన వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, గంగుల కమలాకర్, ఎల్ రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, ని యోజకవర్గాల ఇన్‌చార్జీలు కర్రు నాగ య్య, పి రవీందర్‌రావు, ముద్దసాని కశ్య ప్ రెడ్డి, గండ్ర నళిని, శికారి విశ్వనాథం, రాష్ట్ర కార్యదర్శులు అన్నమనేని నర్సింగరావు, బోనాల రాజేశం, జిల్లా నాయకులు కర్ర విద్యాసాగర్ రెడ్డి, రేండ్ల రాజిరెడ్డి, పుల్కం నర్సయ్య, కర్ర సుమ, ఒం టెల మురళీకృష్ణారెడ్డి, అమిరిశెట్టి భూం రెడ్డి, కళ్యాడపు ఆగయ్య, సత్యనారాయ ణరెడ్డి, పన్యాల శ్యాంసుందర్‌రెడ్డి, పొ ల్సాని రామారావు, మాచర్ల ఎల్లగౌడ్, మహిళా నాయకులు అమీనాబేగం, దూలం రాధిక, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు సుద్దాల వెంకట గౌతంకృష్ణ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు వెల్ముల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద రా జమల్లు, బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మినారాయణ, టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధి బుర్ర సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం చేస్తూ..జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మార్గమధ్యంలో, గ్రామాల్లో త నను కలిసే వృద్ధులకు, వికలాంగులకు రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నారు. ఇలా రో జుకు పది నుంచి 15 మందికి కవర్లలో 2 వేల రూపాయలు పెట్టి ఇస్తున్నారు. కాగా, గురువారం రాత్రి రాంచంద్రా పూర్‌లో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి బస చేశారు.