December 8, 2012

గిరిజనుల అభివృద్ధికి కృషి.. చంద్రబాబు

ఆదిలాబాద్ : జిల్లాలో అధికంగా గిరిజనులు ఉన్నారనీ, తా ను అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనులను అన్ని రంగాల్లో అ భివృద్ధి చేస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భాగంగా మూడో రోజు జిల్లాలోని భైంసా పట్టణంతోపాటు పిప్రికాలనీ, మాటేగాం, వానలపాడు, తిమ్మాపూర్ క్రాస్‌రోడ్, కల్లూరు, బూర్గుపల్లి, అ ర్లిక్రాస్‌రోడ్, చాక్‌పల్లి, కుంటాల క్రా స్‌రోడ్ వరకు 14 కిలోమీటర్ల వరకు శనివారం పాదయాత్ర నిర్వహించా రు. ఈ సందర్భంగా భైంసా, మా టే గాం, వానల్‌పాడ్, కల్లూరు, బూరుగు పల్లి వద్ద నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

బీడీ కా ర్కానాల్లో, జిన్నింగ్‌లలో, దారి పొడువునా రైతులతో ఆయన మా ట్లాడారు. 5 వందల జనాభా ఉన్న ప్ర తి గిరిజన గూడెం, తండాను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయిస్తాన నీ, గిరిజనులకు రూ. లక్షా 50 వేలతో ఇళ్లు నిర్మించి ఇస్తామనీ, ఉచితంగా రెండు ఎకరాల భూమి, గిరిజనుల పి ల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉ చిత విద్య, గిరిజనుల ఆడపిల్లలకు రూ. 50 వేలను ఇచ్చి వివాహం జరిపిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కుల, చేతి వృత్తులు దెబ్బతిన్నాయనీ, తాను అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద ఇచ్చిన పనిముట్లే కనిపిస్తున్నాయన్నారు. మంగలి షాపు ల్లో కుర్చీలు, లాండ్రీషాపుల్లో ఇస్త్రీ పె ట్టెలు ఆదరణ పథకం కింద ఇచ్చామ ని, అవి ఇప్పుడు ఆ దుకాణాల్లో కనిపిస్తున్నాయన్నారు.

విద్యుత్ కోత వల్ల జిన్నింగ్ ఫ్యాక్టరీలు పని చేయకపోవడంతో వేలాది మంది కార్మికులు ఉ పాధి కోల్పోయారన్నారు. జిల్లాలో ల క్షలాది మంది బీడీ కార్మికులు ఉన్నార ని, వెయ్యి బీడీలకు 110 రూపాయలు ఇస్తున్నారన్నారు. బీడీలు చుట్టడం వల్ల వారి ఆరోగ్యాలు పాడైపోతున్నాయనీ, నెలకు 12 రోజులు పని కల్పించడంతో బీడీ కార్మికులు పస్తులుంటున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వ చ్చిన తరువాత వెయ్యి బీడీలకు రూ. 150, నెలకు 26 రోజులు పని కల్పించడంతోపాటు ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు ఏయడంతోపాటు బీడీ కార్మికులకు రూ. లక్షా 50 వేలతో ఇళ్లు ని ర్మించి ఇస్తామన్నారు. జిల్లాలో 10 ల క్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చే స్తున్నారని, పెరిగిన ఎరువుల ధరల వల్ల పెట్టుబడి పెరిగి, ఈ ఏడు దిగుబడి తగ్గిందన్నారు. దానికి తోడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు.

క్వింటాలు పత్తికి రూ. 5 వేల మద్దతు ధర లభించేలా కృషి చేస్తానన్నారు. రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేస్తాననీ, ముఖ్యమంత్రి అయిన తరువాత రుణ మాఫీ ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానన్నారు. బెల్ట్‌షాపులను తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 4 కోట్లను కాజేస్తే ఒక ఏడీఏ జైలు పాలయ్యారనీ, కాంగ్రెస్ నేతలు మాత్రమే బయట హాయిగా తిరుగుతున్నారన్నారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదనీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లు ఇచ్చారని ఆరోపించారు. పాఠశాలల గదుల కొరత, ప్రహారీలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నా రు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కా లువలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వేణుగోపాలచారిని ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర, కేంద్ర మం త్రిని చేస్తే ఆయన ప్రలోభాలకు లొంగి పార్టీని వీడాడనీ, ఇలాంటి అవకాశవాద నాయకులను చిత్తుచిత్తుగా ఓ డించాలన్నారు. పార్టీని వీడిన వారు కా ర్యకర్తలను బెదిరిస్తున్నారనీ, వారికి భ యపడవద్దనీ, అవసరమైతే కార్యకర్తల కోసం తన ప్రాణాలను సైతం అర్పిస్తానన్నారు. సమావేశాల్లో ఎంపీ రమేశ్‌రాథోడ్, ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నగేశ్, టీడీపీ నాయకులు లోలం శ్యాం సుందర్, పాయల శంకర్, నారాయణరెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం, వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోటేశ్వర్‌రావు జీవీ రమణ, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.