December 8, 2012

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాట్లు

భైంసా/ముథోల్/లోకేశ్వరం/కుంటాల : టీడీపీ అధికారం ఇస్తే గ్రా మీణ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పా టు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు అన్నారు. పాదయాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం భైంసాలోని దుర్గ ఇండస్ట్రీస్‌లో వ్యాపార, కులవృత్తుల సమావేశంలో మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉద్యోగాలు పొందవచ్చని అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కు లవృత్తులు, చేతివృత్తుల వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు సైతం ప్రభుత్వం విద్యుత్‌ను అందించలేని స్థితిలో ఉందని విమర్శించారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తే సుపరిపాలన అందిస్తానన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాటీడీపీకి అధికారాన్ని అప్పగిస్తే వ్యవసాయాన్ని లాభసాటి చేసి రైతు కళ్లలో ఆనందాన్ని నింపుతానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నా రు. మాటేగాం సభలో మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే క్రమంలో రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ తొలి సంతకం పెడతానని ప్రకటించారు. అంతేకాకుండా రైతాంగానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గుదిబండగా మారిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతామన్నారు. మీ పిల్లల చదువు బాధ్యతలను తామే తీసుకొని డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు.

జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. 2500 కోట్లతో మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని వెల్లడించా రు. వికలాంగులకు ప్రత్యేక పాలసీని అమలు చేస్తామన్నారు. 500 జనాభా ఉన్న ప్రతి తండాను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్‌మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. తెలంగాణపై అధికారంలో ఉన్నవారు ఏ నిర్ణయం తీసుకోకుండా టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు దీనిని గమనించాలని కోరారు. చంద్రబాబు నాయుడుతో పాటు జిల్లా ఎంపీ రాథోడ్ రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్, ముథోల్ నియోజక వర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, లోలం శ్యామ్‌సుందర్, జుట్టు అశోక్, రమాదేవి తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన బాబుకుంటాల/లోకేశ్వరం : అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి అవినీతిలో ము నిగిపోయిందని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు విమర్శించారు. పాదయాత్రలో శనివారం రాత్రి 9:45 గంటలకు కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబొల్లి కబర్లు చెప్పి అధికారంలోకి వచ్చిందని వచ్చిన నాటి నుంచి అవినీతికి తెర లేపిందన్నారు. ఉచిత విద్యుత్ అంటూనే ప్రస్తుతం గృహ విద్యుత్‌కు సర్ చార్జీలు విధిస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో మంత్రులు, అధికా రులు సైతం నిందితులయ్యారని విమర్శించారు. లక్షల కోట్లు అక్రమం గా దండుకున్నారని పేర్కొన్నారు. నిత్యవసర సరుకుల ధరలతో పాటు డిజిల్, పెట్రోల్ ధరలు పెంచారన్నా రు. ఇప్పటికే కాంగ్రెస్‌లో నుంచి విడిపోయిన పిల్ల కాంగ్రెస్ అధికారం కోసం తహతహలాడుతోందని వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మి వేస్తారన్నారు. సామాజిక న్యాయం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు చిరంజీవి మంత్రి కాగానే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేశారని విమర్శించారు. పేదల పార్టీ టీడీపీ పార్టీ అని మరోసారి తనకు అవకాశం ఇస్తే పెద్దబిడ్డగా రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితమవుతానని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తానెప్పుడూ వ్యతిరేకిని కానని స్పష్టం చేశారు.

అఖి లపక్ష సమావేశం నిర్వహిస్తే తమ వైఖరిని స్పష్టం చేస్తామన్నారు. వృద్ధు ల, వికలాంగుల, మహిళల యువత కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడానికి ముందుంటానన్నారు. కుం టాల మండలంలోని సమస్యల పరి ష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు వెంట ముథోల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎల్. నారాయణరెడ్డి, ఆదిలాబాద్ నియో జకవర్గ ఇన్‌చార్జీ పాయల్ శంకర్, టీడీ పీ జిల్లా నాయకులు యూనిస్ అక్బానీ, అబ్దుల్ కలాం తదితరులు ఉన్నారు.

నారాయణ్‌రెడ్డిముథోల్ టిక్కెట్ ఇవ్వాలికుంటాల/భైంసా/ముథోల్/లోకేశ్వరం : ముథోల్ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నారాయణ్‌రెడ్డికే అసెంబ్లీ టికెట్‌ను ఇవ్వాలని ఓ కార్యకర్త బాబు బహిరంగ సమావేశంలో మైకు పట్టుకుని విజ్ఞప్తి చేశారు.

పాదయాత్రలో భాగంగా మాటేగాం వద్ద ఆగిన చంద్రబాబు కార్యకర్తలకు మైకు ఇచ్చి మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో మకు అందుకున్న ఓ కార్యకర్త నీతివంతుడైన నారాయణరెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గంలో కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు, కార్యకర్తలు చప్పట్లు కొట్టారు.

బాబు దీనిపై స్పందిస్తూ నీతివంతమైన వారికే ఓటు వేసి గెలుపించుకోవాలని అన్నారు.

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనంతానూరు : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను మండల మాల మహనాయకులు దహనం చేశారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతుండగా పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషం అన్నారు. సాయినాథ్ బద్రే, రాందాస్ పవార్, సాహెబ్‌రావు, భీంరావు పవార్ తదితరులు ఉన్నారు.