December 3, 2012

విజయవంతంగా వెయ్యి కి లోమీటర్ల దూరం పూర్తి

వెయ్యినొక్కసారి..
అక్షరమాలలో తొలి అక్షరం అనంతపురంలో శ్రీకారం చు ట్టుకొన్న పాదయాత్ర సోమవారం విజయవంతంగా వెయ్యి కి లోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ గ్రామం వద్ద వెయ్యి కిలోమీటర్లలో చివరి అడుగును చం ద్రబాబు మోపారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. భారీ ఎత్తున కటౌట్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 999 కొబ్బరికాయలు కొట్టారు. జాడిజమాల్‌పూర్‌లో పాదయాత్రకు గుర్తుగా స్తూపంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాయకులు బాబుతో కేక్ కట్ చేయించారు. వెయ్యి బెలూన్లను గాలిలోకి వదిలారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొన్న సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం సాయంత్రం దీపోత్సవం నిర్వహించారు. 'వస్తున్నా.. మీ కోసం' అన్న పేరును పసుపు కుంకుమ, రంగులతో రాసి వాటిని పార్టీ అనుబంధ తెలుగు మహిళా విభాగం నాయకులు దీపాలతో అలంకరించారు. మొదటి దీపాన్ని పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహం వద్ద వెలిగించి తర్వాత మిగిలినచోట్ల వెలిగించారు. ఈ సందర్భంగా బెలూన్లు ఎగురవేసి కేక్ కత్తిరించారు. మహిళా నాయకురాళ్ళు కొద్దిసేపు నృత్యం చేశారు. చంద్రబాబు నిండు ఆరోగ్యంతో పాదయాత్ర పూర్తి చేసుకోవాలని నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.